పట్టణంలో మంగళవారం శ్రీకంఠపురం, రమహత్‌పురం ప్రాంతాలకు చెందిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్ కలెక్టర్‌ను కోరారు.
హిందూపురం టౌన్ : పట్టణంలో మంగళవారం శ్రీకంఠపురం, రమహత్‌పురం ప్రాంతాలకు చెందిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్ కలెక్టర్‌ను కోరారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసిన సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందూపురంలో నాలుగు రోజుల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
అయితే దాడుల్లో అమాయకుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ శాంతిసంఘ సమావేశం నిర్వహించి ఇరువర్గాలు, ఎస్పీతో చర్చించి న్యాయం చేస్తామన్నారు.