ఆత్మకూరు : వచ్చే ఏడాదికి జిల్లాలోని 1260 చెరువులను హంద్రీ-నీవా లేదా హెచ్చెల్సీ నీటితో నింపుతామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె ఆత్మకూరు మండలంలోని తలుపూరులో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ కోన శశిధర్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికీ సైబర్‌నెట్ అందుబాటులోకి రానుందని, దీని కోసం ప్రతి నెల రూ.149 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... కొందరు స్థానికులు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. ఏపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పనులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే ఏడాదికి 1,260 చెరువులకు నీరు
Published Fri, Jan 6 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
Advertisement