సాక్షి, తాడేపల్లి: ఖరీఫ్ సీజన్ లో 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆయన సోమవారం తాడేపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల పై కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. 1820 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. నాబార్డ్ నుంచి అడ్వాన్సు తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా బకాయిలు చెల్లించమని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు.
రెండు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. రైతులు.. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. తడిసిన ధాన్యాలకు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1902’ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమాచారం అందిస్తారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కోన శశిధర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment