సింగపూర్‌ వెళ్లనున్న కలెక్టర్‌ | collector going to singapore on november | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ వెళ్లనున్న కలెక్టర్‌

Published Wed, Oct 26 2016 10:43 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

collector going to singapore on november

అనంతపురం అర్బన్‌ : కలెక్టర్‌ కోన శశిధర్‌ నవంబరులో సింగపూర్‌ సందర్శనకు వెళ్లనున్నారు. ఈ కారణంగా  నవంబరు 23 నుంచి 28 వరకు ఆరు రోజుల పాటు సెలవుతో పాటు దేశం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి కోరూతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం సెలవు మంజూరు చేయడంతో పాటు, సింగపూరు వెళ్లేందుకు అనుమతిని ఇస్తూ ఈ నెల 25న జీవో 2193ని ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సత్య ప్రకాశ్‌ టక్కర్‌ జారీ చేశారు. కలెక్టర్‌ సెలవులో ఉండే ఆరు రోజులు పాటు ఇన్‌చార్జి కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతంకి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement