సింగపూర్ వెళ్లనున్న కలెక్టర్
అనంతపురం అర్బన్ : కలెక్టర్ కోన శశిధర్ నవంబరులో సింగపూర్ సందర్శనకు వెళ్లనున్నారు. ఈ కారణంగా నవంబరు 23 నుంచి 28 వరకు ఆరు రోజుల పాటు సెలవుతో పాటు దేశం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి కోరూతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం సెలవు మంజూరు చేయడంతో పాటు, సింగపూరు వెళ్లేందుకు అనుమతిని ఇస్తూ ఈ నెల 25న జీవో 2193ని ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ జారీ చేశారు. కలెక్టర్ సెలవులో ఉండే ఆరు రోజులు పాటు ఇన్చార్జి కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతంకి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.