విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు.
అనంతపురం అర్బన్ : విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. జిల్లాలో చేపట్టిన, చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమైన నిధుల వివరాలను సదస్సు ద్వారా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నారు. వేరుశనగ పంట పరిస్థితి, రక్షక తడులు అందించిన వివరాలను, పరిశ్రమలకు అవసరమైన భూ సేకరణ, అందుకు చేపట్టిన చర్యలు, హంద్రీ నీవా పనుల పురోగతి వివరాలను ప్రభుత్వానికి వివరిస్తారని సమాచారం.