'కబీర్ పురస్కారాలకై దరఖాస్తు చేసుకోండి' | Apply for Kabir puraskaras says collector | Sakshi
Sakshi News home page

'కబీర్ పురస్కారాలకై దరఖాస్తు చేసుకోండి'

Published Wed, Mar 25 2015 9:19 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Apply for Kabir puraskaras says collector

అనంతపురం అర్బన్: మతసామరస్యం, జాతీయ సమైక్యతకై పాటుపడిన వారు 2015 సంవత్సరానికి కబీర్ పురస్కారాలకై ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత ప్రోఫార్మాలో పూర్తి చేసిన దరఖాస్తును ట్రిప్లికేట్‌లో పంపాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వాటితో పాటు దరఖాస్తుదారుడు వారు కృషి చేసిన రంగంలోని అంశాలను, విశేషాలను జతచేయాలన్నారు. గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని తెలియజేశారు. దరఖాస్తులను అనంతపురము కలెక్టర్ కార్యాలయములో హెచ్ సెక్షన్ నందు పొందవచ్చునని, పూరించిన దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయము, హెచ్ సెక్షన్, అనంతపురము.. చిరునామాకు ఈ నెల 31 వతేదీ లోపు పంపాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement