ఓటర్‌ జాబితా నుంచి మాజీ సీఎం పేరు గాయబ్‌! | Ex CM Name Out From Voter List EC Says This | Sakshi
Sakshi News home page

ఓటర్‌ జాబితా నుంచి మాజీ సీఎం పేరు గాయబ్‌! ఈసీ ఏమందంటే..

Published Thu, Jan 23 2025 2:43 PM | Last Updated on Thu, Jan 23 2025 3:50 PM

Ex CM Name Out From Voter List EC Says This

డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ జరగ్గా.. డెహ్రాడూన్‌లో ఓటేయడానికి వెళ్లిన ఆయన పేరు ఓటర్‌ లిస్ట్‌లో మిస్‌ అయ్యింది. దీంతో ఆయన అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయారు.

డెహహ్రాడూన్‌లోని నిరంజన్‌పూర్‌లో రావత్‌ 2009 నుంచి నివాసం ఉంటున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు.

‘‘ గత 16 ఏళ్లుగా నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా.  కానీ, ఇప్పుడు నా పేరే లేకుండా పోయింది. ఉదయం నుంచి నేను పోలింగ్‌ స్టేషన్‌ వద్దే ఉన్నా. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకే ఇలా జరిగిందంటే.. ఇది కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం’’ అని అన్నారాయన.

 

దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే.. కంప్యూటర్‌ సర్వర్‌లో తలెత్తిన సమస్యే ఇందుకు కారణంగా తేలింది. దీంతో రావత్‌కు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని ఈసీ సమాచారం అందించింది.

ఉత్తరాఖండ్‌లో ఇవాళ 11 మున్సిపల్‌ కార్పోరేషన్లు, 43 మున్సిపల్‌ కౌన్సిల్స్‌, 46 నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలంటూ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఉదయం ఓటర్లను అభ్యర్థించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement