రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీ లీల కథానాయిక. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టింది యూనిట్. స్టంట్ శివ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డి.
Comments
Please login to add a commentAdd a comment