
నాగవంశీ, రాధాకృష్ణ, గౌతమ్ తిన్ననూరి, శ్రద్ధా శ్రీనాథ్, నాని, త్రివిక్రమ్, పీడీవీ ప్రసాద్
గ్రౌండ్‌లో హీరో నాని ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి మొదలవుతోంది. మరి... మ్యాచ్‌లో నాని ప్రత్యర్థులకు ఎలా ముచ్చెమటలు పట్టిస్తారనే విజువల్స్‌ను వెండితెరపై చూసేందుకు చాలా సమయం ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. కన్నడ ‘యూ–టర్న్’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే ప్రారంభం అవుతుంది.‘‘స్పోర్ట్స్ అండ్ రిలేషన్‌షిప్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం టీమ్ అందరూ చాలా కష్టపడుతున్నారు’’ అని పేర్కొన్నారు శ్రద్ధా శ్రీనాథ్. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రానికి సాను వర్గీస్ ఛాయాగ్రాహకుడు.
Comments
Please login to add a commentAdd a comment