
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ఈ సినిమాతో సాండల్‌వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. 19న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రద్ధా ఇచ్చిన స్పీచ్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగులో తొలి సినిమానే అయిన శ్రద్ధా తెలుగులో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అభిమానులను ఉత్సాహపరిచేందుకు ‘జై నాని అన్న’ అనడంతో అంతా అవాక్కయ్యారు. సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లు హీరోలను అన్న అని పిలిచిన సందర్భాలు పెద్దగా కనిపించవు. అలాంటి శ్రద్ధ నానిని అన్న అనటంతో అభిమానులు అవాక్కయ్యారు.
మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఎమోషనల్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment