శ్రద్ధా శ్రీనాథ్
‘‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఆసక్తి. కాలేజీలో ఉన్నప్పుడు థియేటర్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నటనతో ప్రేమలో పడిపోయాను. ఐదేళ్లు లా చేశాక యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అర్థం అయింది. రెండేళ్లు లాయర్‌గా పని చేసిన తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చేశాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అవుతున్న శ్రద్ధా పంచుకున్న విశేషాలు..
► మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్. ఎక్కువ ట్రాన్స్‌ఫర్లు అవుతుండేవి. 9 స్కూల్స్ వరకు మారాను. సికింద్రాబాద్‌లో ఆరేళ్లు ఉన్నాం. 7వ క్లాస్ నుంచి +2 వరకూ కేవీ తిరుమలగిరిలో చదువుకున్నాను.
► 2017లోనే రెండు తెలుగు సినిమాలు అంగీకరించాను. సురేశ్ ప్రొడక్షన్స్‌లో ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు సినిమా ఒకటి. ఆది సాయికుమార్‌తో ‘జోడీ’ సినిమా రెండోది. ‘జెర్సీ’ 2018 అక్టోబర్‌లో అంగీకరించాను. అనుకోకుండా ‘జెర్సీ’ ముందుగా రిలీజ్ అవుతోంది. ఇందులో ఎమోషన్స్‌ని చాలా నిజాయతీగా చూపించాం.
► ఈ సినిమాలో నటించేటప్పుడు భాష ఇబ్బంది పెడుతుందని టెన్షన్ పడ్డాను. ఆ విషయంలో నాని హెల్ప్ చేశారు. ‘నువ్వు చెయ్యగలవు’ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాని బెస్ట్ కో స్టార్. మన పెర్ఫార్మెన్స్ మన కో యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది.
► చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగానే చూస్తాను. వన్ డే, వరల్డ్‌కప్స్ తప్పకుండా ఫాలో అవుతుంటా. రాహుల్ ద్రావిడ్ నా ఫేవరెట్ క్రికెటర్.
► కన్నడ, తెలుగు, తమిళం.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో చేసే పని కామనే. భాష ఒక్కటే మారుతుంది. అందుకే వేరు వేరు ఇండస్ట్రీల్లో పని చేయడం డిఫరెంట్‌గా అనిపించదు.
► ‘జెర్సీ’లో పెళ్లి కాకముందు టీనేజ్ అమ్మాయిలా, పెళ్లి తర్వాత మెచ్యూర్డ్ రోల్‌లో కనిపిస్తా. ఏదైనా పాత్ర చేస్తే వెంటనే ఓ బ్రాండ్ మన మీద వేసే ఇండస్ట్రీ ఇది. ఫస్ట్ సినిమాలోనే తల్లి పాత్రలో నటిస్తే ఎలా? అలాంటి పాత్రలే వస్తాయా? అనే భయం ఉంది. కానీ ‘జెర్సీ’ లాంటి స్క్రిప్ట్‌లు ఎప్పుడూ రావు. బ్రాండింగ్‌ల గురించి భయపడకుండా చేశా. డబ్బింగ్ చెబుదాం అనుకున్నాను. టైమ్ కుదర్లేదు.
► మణిరత్నంగారి సినిమాలో కనిపించాలని ‘చెలియా’ లో చిన్న పాత్ర చేశాను. కన్నడలో నేను నటించిన ‘యూటర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత చేశారు. అందులో రచన పాత్ర నాకు స్పెషల్. తెలుగులో ఈ సినిమా ఇంకా పూర్తిగా చూడలేదు.
► ‘పెళ్లి చూపులు, బాహుబలి’ సినిమాలు చూశాను. తెలుగులో రాజమౌళిగారు, త్రివిక్రమ్‌గారు, తరుణ్ భాస్కర్ సినిమాల్లో చేయాలనుంది.
Comments
Please login to add a commentAdd a comment