అవసరమైతే తాతగా మారతా! | Actor Nani Exclusive Interview About Jersey Movie | Sakshi
Sakshi News home page

అవసరమైతే తాతగా మారతా!

Published Thu, Apr 18 2019 12:42 AM | Last Updated on Thu, Apr 18 2019 5:33 AM

Actor Nani Exclusive Interview About Jersey Movie - Sakshi

నాని

‘‘స్టార్‌డమ్‌ని నమ్ముతాను. కానీ స్టార్‌డమ్‌కు ఇప్పుడున్న అర్థాన్ని మాత్రం నమ్మను. సినిమాలోని కంటెంట్‌ వల్లే స్టార్‌డమ్‌ వస్తుందన్నది నా నమ్మకం’’ అని నాని అన్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధాశ్రీనాథ్‌ కథానాయికగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జెర్సీ’ ప్రయాణం, ఇతర విశేషాలను నాని ఈ విధంగా చెప్పారు.

► ఇప్పటికి 22 సినిమాలు చేశారు. ‘జెర్సీ’ మీకు ఏ విధంగా స్పెషల్‌?
ఎప్పటిలాగే సినిమా రిలీజ్‌ అంటే నెర్వస్‌గా ఫీల్‌ అవ్వడం, టెన్షన్‌ పడటంలాంటివి ఉంటాయనుకున్నాను. ‘జెర్సీ’ సినిమాకు మాత్రం ఏదో మ్యాజిక్‌ ఫీలవుతున్నాను. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. దీనికి ఏం పేరు పెట్టాలో అర్థం కావడం లేదు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఏదో గొప్ప పని చేశామనే ఫీలింగ్‌ ఉంది. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమా గురించి నా హార్ట్‌లో ఉన్న ఫీలింగ్‌ ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తోంది. జెన్యూన్‌గా మేం అందరం కలిసి క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌కు ఆడియన్స్‌ ఎంత కనెక్ట్‌ అయ్యారన్నది రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది.

► ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మీ సినిమా రిలీజ్‌కు ఇది సరైన సమయం అని భావిస్తున్నారా?
ఐపీఎల్‌ సీజన్‌.. మన సినిమా వర్కౌట్‌ అవుతుందా? లేదా? ఓపెనింగ్‌ ఎంత ఉంటుంది? బ్లాక్‌బస్టరా? హిట్టా? అన్నవి ఆలోచించలేదు. సినిమాకు ఒక నంబర్, ఒక లెక్క కట్టి కంట్రోల్‌ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు.

► ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంలో కబడ్డీ ఆడారు. ఇప్పుడు ‘జెర్సీ’ కోసం క్రికెట్‌.  ఏది కష్టంగా అనిపించింది?
ఫిజికల్‌గా రెండూ ఒకటే. ‘భీమిలి కబడ్డీ జట్టు’కి అంతగా శిక్షణ తీసుకోకుండానే కబడ్డీ ఆడాం. కాబట్టి ఎక్కువ దెబ్బలు తగిలాయి. కానీ అప్పట్లో ఇంత మీడియా, సోషల్‌ మీడియా లేదు కాబట్టి బయటకు రాలేదు. ‘జెర్సీ’ సినిమాకు ఫుల్‌ ట్రైనింగ్‌ తీసుకుని ఆడాను. ట్రైనింగ్‌లో ఫిజికల్‌గా కష్టమనిపించింది. ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో నేనెంత ప్రొఫెషనల్‌గా కబడ్డీ ఆడానో తెలియదు కానీ ‘జెర్సీ’లో మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా క్రికెట్‌ ఆడాను.

► ‘భీమిలి కబడ్డీ జట్టు’ క్లైమాక్స్‌ విషాదకరంగా ఉంటుంది. ‘జెర్సీ’ సినిమాలో కూడా అలాంటి క్లైమాక్సే అని తెలిసింది?
అది సినిమాలో తెలుస్తుంది. ఇంకా సినిమా రిలీజ్‌ కాకముందే ఎండింగ్‌ల గురించి మాట్లాడుకోవడం సరైన విషయం కాదు. ఒకవేళ నేను సాడ్‌ ఎండింగ్‌ కాదు అంటే హ్యాపీ ఎండింగ్‌ అని కన్ఫార్మ్‌ చేయడమే కదా. అసలు నేను ఎండింగ్‌ గురించి ఎందుకు మాట్లాడాలి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌ నవ్వుతూ, ఒక ఎనర్జిటిక్‌ ఫీలింగ్‌తో బయటకు వస్తారు. అలాగే ఇది ఏ క్రికెటర్‌ బయోపిక్‌ కాదు. ట్రైలర్, టీజర్‌ చూసి కొందరు అలా ఊహించుకుని ఉండొచ్చు.

► గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించడం గురించి?
గౌతమ్‌ తెరకెక్కించిన ‘మళ్ళీ రావా’ నేను చూడలేదు. కానీ మంచి సినిమా అని ఆడియన్స్‌ నిర్ణయించారని చెబితే విన్నాను. గౌతమ్‌తో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్‌లో గౌతమ్‌ వర్క్‌ తెలుస్తుంది. అలాగే నిర్మాత వంశీ నా క్లాస్‌మేట్‌. సత్యరాజ్‌గారితో నటించడం గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. సెట్‌లో చాలా సరదాగా గడిచింది.

‘జెర్సీ’ సినిమా సెట్‌లో గాయపడ్డట్లు ఉన్నారు? బాల్‌ తగిలిందా?
గాయపడింది బాల్‌ తగలడం వల్ల కాదు.  సినిమాలో రనౌట్‌ షాట్‌ను షూట్‌ చేసే ప్రాసెస్‌లో ఒకరికొకరం గుద్దుకున్నాం. ముక్కుకు బాగా దెబ్బ తగిలింది. అలా ఓ పక్కకి ఒరిగినట్లు అయింది. హాస్పిటల్‌కి వెళితే డాక్టర్‌ సెట్‌ చేశారు.

► సినిమా కోసం ఇంత కష్టం అవసరమా అని ఆ టైమ్‌లో అనిపించిందా?
ఏం అనిపించలేదు. అయ్యో... రేపు షూటింగ్‌ ఎలా అనిపించింది. నెక్ట్స్‌ డే మార్నింగ్‌ 10కి షూటింగ్‌కి వెళ్లాను.

► కబడ్డీ... క్రికెట్‌ ఆడారు. నెక్ట్స్‌ ఏం ఆడాలనుకుంటున్నారు?
స్పోర్ట్స్‌ సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇస్తాను. ఆ టైమ్‌లో కథను బట్టి ఏ ఆట ఆడాలో ఆ ఆట ఆడతాను.

► ఈ చిత్రంలో రెండు లుక్స్‌లో కనిపించారు. ముఖ్యంగా తండ్రి పాత్ర చేయడం కెరీర్‌కు ఏమైనా రిస్క్‌ అనుకున్నారా?
పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి మంచి ఎఫర్ట్‌ పెట్టాను. ఈ ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. కథ పరంగా తండ్రిగానే కాదు... అవసరమైతే ప్రోస్థటిక్‌ మేకప్‌ వేసుకుని తాతలా మారడానికి కూడా ఇష్టమే.

► ‘జెర్సీ’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో వెంకటేశ్‌గారు మిమ్మల్ని ప్రశంసించడం ఎలా అనిపించింది?
చిన్నతనం నుంచి నాకు వెంకటేశ్‌గారంటే చాలా ఇష్టం. నిజంగా ఆయనది మంచి మనసు. ఆయన ఎంత కూల్‌గా ఉంటారో పర్సనల్‌గా కలిస్తే అర్థం అవుతుంది. ఏ యాక్టర్‌తో అయినా ఇట్టే ఫ్రెండ్‌లా కలిసిపోతారు. మా సినిమా వేడుకకు వచ్చి టీమ్‌లో పాజిటివ్‌ ఎనర్జీ నింపారు.

► ‘కృష్ణార్జున యుద్ధం’ ఆడలేదు బాబాయ్‌ అని మీరు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. దానివల్ల ఆ సినిమా దర్శక–నిర్మాతలు ఫీల్‌ అవుతారనిపించలేదా?
ఇప్పుడు సినిమా ఆడిందన్నాననుకోండి.. నిజం అయిపోదుగా? దర్శక–నిర్మాతలు ఆడింది అంటే.. నిజమైపోదుగా. నిజాన్ని ఒప్పుకోవాలి. దాచాల్సిన అవసరం లేదనిపించింది. ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఏం? సాహు (నిర్మాత), గాంధీ (డైరెక్టర్‌), నేను ముగ్గురం కలిసి ఇంకో సినిమా చేస్తాం. బ్లాక్‌బస్టర్‌ కొడతాం.

► బయోపిక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. మీకు ఏవైనా ఆఫర్లు వచ్చాయా?
రెండు అవకాశాలు వచ్చాయి. కుదర్లేదు. అయితే.... బయోపిక్కా? కాదా? అని కాదు. నాకు చెప్పిన కథ ఎలా ఉందీ అని ఆలోచించి, నచ్చితే చేస్తాను. ఇప్పుడు ఈయన కథ చెబుతున్నాం సినిమా చేద్దాం అంటే.. అది కాదు. ఆయన కథ ఎలా చెబుతున్నారు? ఫస్ట్‌ సీన్‌ ఎంటీ? లాస్ట్‌ సీన్‌ ఎంటీ? అని తెలుసుకుని చేస్తాను. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి చేసుకుంటూ వెళ్తాను. భవిష్యత్‌లో వాటిలో బయోపిక్స్‌ ఉంటాయో లేవో ఇప్పుడే చెప్పలేను.

► నిర్మాతగా మీ నెక్ట్స్‌ చిత్రం ఎప్పుడు?
ఇటీవలే ఒక స్టోరీలైన్‌ను ఓకే చేశాం. త్వరలో చెబుతాను.

► వెబ్‌ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారా?
ఇప్పుడు నాన్‌స్టాప్‌గా సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి అయ్యేసరికి దాదాపు రెండేళ్ల టైమ్‌ పట్టొచ్చు. రాబోయే కాలంలో వెబ్‌ సిరీస్‌లకు పెద్ద మార్కెట్‌ ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు డైరెక్ట్‌ చేయవచ్చు కూడా. ఆ టైమ్‌ వచ్చినప్పుడు తప్పకుండా సరైన నిర్ణయమే తీసుకుంటాను.

► ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు?
యాక్టర్‌గా పరిణితి చెందాను. నేను ప్రయాణించాల్సిన దూరం, నేర్చుకోవాల్సినది చాలా ఉంది.  

► న్యాచురల్‌స్టార్‌ అనే ట్యాగ్‌ ముందు ఎందుకు అనిపించింది. ఆ తర్వాత అది అభిమానుల ప్రేమగా తీసుకుంటున్నాను. సినిమాను బట్టి నా రెమ్యునరేషన్‌ మారుతుంటుంది.  ∙‘గ్యాంగ్‌ లీడర్‌’ టైటిల్‌ విషయంలో ఏ ఇష్యూ లేదు.

► ‘మజిలీ’ సినిమా నేను చూడలేదు. అందుకే ‘జెర్సీ’, ‘మజిలీ’ సినిమాల మధ్య పోలికల గురించి మాట్లాడలేను. ఎప్పటిలాగే ‘జెర్సీ’ కథ విన్నాను. కానీ సినిమా చేయాలని చాలా తక్కువ సమయంలో నిర్ణయం తీసుకున్నాను. ‘జెర్సీ’ సినిమా సీక్వెల్‌ లేదు. క్రికెట్‌లో నాకు డేనియల్‌ శిక్షణ ఇచ్చారు.

► థ్రిల్లింగ్‌గా థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూసే ఎంజాయ్‌మెంట్‌ను ఈ తరం ఆడియన్స్‌ బాగా మిస్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వస్తున్నాయి. సెల్‌ఫోన్‌లు ఆఫ్‌ చేసి థియేటర్స్‌కు వెళితే మార్నింగ్‌ షో మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement