PVV Prasad
-
ఆట ఆరంభం
గ్రౌండ్లో హీరో నాని ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి మొదలవుతోంది. మరి... మ్యాచ్‌లో నాని ప్రత్యర్థులకు ఎలా ముచ్చెమటలు పట్టిస్తారనే విజువల్స్‌ను వెండితెరపై చూసేందుకు చాలా సమయం ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. కన్నడ ‘యూ–టర్న్’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే ప్రారంభం అవుతుంది.‘‘స్పోర్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం టీమ్ అందరూ చాలా కష్టపడుతున్నారు’’ అని పేర్కొన్నారు శ్రద్ధా శ్రీనాథ్. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రానికి సాను వర్గీస్ ఛాయాగ్రాహకుడు. -
‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో అవినీతి’
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌కు చెందిన రూ.2 కోట్లు క్యాన్సిలేషన్ చేసి యూనియన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి పీవీవీ ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం వద్ద 35 ఎకరాల కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి ఎకరం విలువ రూ.3.30 లక్షలు మాత్రమే ఉండగా వారు మాత్రం రూ.5.30 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. యూనియన్ డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పారు.ఈ మేరకు ఫిర్యాదు పత్రంపై సంఘం సభ్యులు 60 మంది సంతకాలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పోలీసులను కలిసిన వారిలో ఉన్నారు.