‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో అవినీతి’ | corruption in film - TV production assistants union | Sakshi
Sakshi News home page

‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో అవినీతి’

Mar 14 2016 6:12 PM | Updated on Oct 2 2018 2:44 PM

తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌కు చెందిన రూ.2 కోట్లు క్యాన్సిలేషన్ చేసి యూనియన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి పీవీవీ ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు.

 

రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం వద్ద 35 ఎకరాల కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి ఎకరం విలువ రూ.3.30 లక్షలు మాత్రమే ఉండగా వారు మాత్రం రూ.5.30 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. యూనియన్ డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పారు.ఈ మేరకు ఫిర్యాదు పత్రంపై సంఘం సభ్యులు 60 మంది సంతకాలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పోలీసులను కలిసిన వారిలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement