శ్రద్ధా శ్రీనాథ్
‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ తో మంచి హిట్ అందుకున్నారు విశాల్. ఇప్పుడాయన ‘అభిమన్యుడు’ కి సీక్వెల్‌గా రూపొందనున్న ‘అభిమన్యుడు 2’ లో నటించనున్నారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో విశాల్‌కి జోడీగా సమంత నటించారు. అయితే సీక్వెల్‌లో మాత్రం విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ని తీసుకున్నారట చిత్రబృందం.
నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రద్ధాశ్రీనాథ్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ‘అభిమన్యుడు’ సినిమాని తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ‘అభిమన్యుడు 2’ కి దర్శకత్వం వహించకపోవడం. ఈ సీక్వెల్‌కి కొత్త డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పందెంకోడి 2’ కి మీరాజాస్మిన్ ప్లేస్‌లో కీర్తీసురేష్‌ని తీసుకున్నారు. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’కి సమంత ప్లేస్‌లో శ్రద్ధాశ్రీనాథ్‌ని, మిత్రన్ స్థానంలో ఆనంద్‌ని తీసుకోవడం ఆసక్తికరం. త్వరలోనే ‘అభిమన్యుడు 2’ సినిమా పట్టాలెక్కనుందట.
Comments
Please login to add a commentAdd a comment