
‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా బెడిసికొట్టడంతో.. మళ్లీ రూట్ మార్చి కథాబలం ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవలె ‘దేవదాస్’ సినిమాతో హిట్ కొట్టాడు నాని. ‘మళ్లీరావా’ ఫేమ్ డైరెక్టర్‌తో జెర్సీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను డిఫరెంట్‌గా రిలీజ్ చేశారు. ఓ బ్యాట్‌పై జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 19)ను ఫిక్స్ చేశారు. ‘యూ టర్న్’ భామ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
19 April'19
— Nani (@NameisNani) November 23, 2018
It’s going to be a heartwarming summer.
Promise :)#JERSEY @ShraddhaSrinath @gowtam19 @anirudhofficial @vamsi84 pic.twitter.com/33PC6PT6vr