నాని ‘జెర్సీ’ ఫస్ట్‌లుక్‌! | Nani Jersey First Look Out | Sakshi
Sakshi News home page

Dec 31 2018 5:40 PM | Updated on Dec 31 2018 5:42 PM

Nani Jersey First Look Out - Sakshi

కృష్ణార్జున యుద్దం,దేవదాస్‌ లాంటి రెగ్యులర్‌ ఫార్మాట్‌ చిత్రాల ఫలితాలతో నిరాశపడ్డ నాని.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాని ప్రస్తుతం క్రికెటర్‌గా మారి స్టేడియంలో బౌండరీలు కొట్టేస్తున్నాడు. ‘మళ్లీ రావా’  ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ’జెర్సీ’ చిత్రంలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

నూతన సంవత్సరం కానుకగా జెర్సీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. క్రికెటర్‌గా అర్జున్‌ పాత్రలో నాని నటిస్తుండగా తమిళ సంచలనం అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతమందించడం విశేషం. అర్జున్‌ సాధించిన విజయాలను ఏప్రిల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement