
గ్రౌండ్‌లో నాని దూకుడు ఇంకా తగ్గలేదు. పైగా స్పీడ్ పెంచారు. నాని హీరోగా ‘మళ్ళీ రావా..’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నారు నాని. ఆయన రెండు లుక్స్‌లో కనిపిస్తారు. ఒకటి యంగ్ లుక్‌లో ఉంటే... మరొకటి 36–40 వయసులో ఉన్న వ్యక్తి పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
నాని, శ్రద్ధా శ్రీనాథ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తయింది. మరి.. క్రికెటర్ అర్జున్‌గా నాని ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తారా? లేక బౌలింగ్, కీపింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ అనిపించుకుంటారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment