నాగ్‌-నాని సినిమాలో ఆమెకు గోల్డెన్‌ చాన్స్‌! | Actress Shraddha Srinath gets jackpot in Nagarjuna-Nani multi-starrer | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 15 2018 11:51 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Actress Shraddha Srinath gets jackpot in Nagarjuna-Nani multi-starrer - Sakshi

శ్రద్ధ శ్రీనాథ్‌.. యూటర్న్‌, ఆపరేషన్‌ అలమేలమ్మ, విక్రమ్‌ వేదా వంటి దక్షిణాది సినిమాలతో దుమ్మురేపిన ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ భామ హే కృష్ణ ముకుంద మురారీ, నిన్ను వదిలి నేను పోలేనులే సినిమాలతోపాటు.. ఆది సాయికుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా శ్రద్ధకు మరో జాక్‌పాట్‌ తగిలింది.

అక్కినేని నాగార్జున-నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ సినిమాలో ఈ అమ్మడికి చాన్స్‌ దక్కినట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్‌ సరసన నటించే అవకాశం శ్రద్ధకు దక్కింది. ఇటీవలే దర్శకుడు శ్రద్ధకు కథ వినిపించాడని, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఆమె సంతకం చేయలేదని పేర్కొన్నాయి. ఈ నెల 24న ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది. మార్చి మొదటివారం నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమాలో నానికి జోడీగా నటించే హీరోయిన్‌ కోసం ప్రస్తుతం మేకర్లు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement