Multi-starrer Movie
-
మరో మల్టీస్టారర్?
‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలసి నటించింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. అయితే అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్‌న గర్ టాక్. కుమారులు చైతన్య, అఖిల్‌తో కలసి ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట నాగార్జున. ఈ మల్టీస్టారర్ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారట. గతంలో రాహుల్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని చేశారు నాగార్జున. ఈ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
కాంబినేషన్ కుదిరెనా?
ఐదువందల చిత్రాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తన కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను సంపాదించుకున్నారు నటులు మోహన్‌బాబు. ఇక దర్శకులు మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలకు పెద్ద పెద్ద స్టార్సే అభిమానులుగా ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు వర్క్ చేయబోతున్నట్లు తెలిసింది. రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్‌బాబును సంప్రదించారట మణిరత్నం. కథ కూడా నరేట్ చేశారని తెలిసింది. ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం ఆల్రెడీ సల్మాన్‌ఖాన్, ఐశ్యర్యారాయ్, శింబు వంటి తారలను మణిరత్నం సంప్రదించారనే వార్త వచ్చింది. ఇప్పుడు మోహన్‌బాబును కలవడం ఆసక్తికరమైన అంశం. ఇది ఎవరూ ఊహించని కాంబినేషన్. అన్నీ కుదిరితే త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని చెన్నై టాక్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించా లనుకుంటున్నారట. షూటింగ్‌ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. -
వెయ్యి మందినీ ఒకేసారి రమ్మను
‘ఒక్కొక్కడినీ కాదు షేర్‌ఖాన్ వందమందినీ ఒకేసారి రమ్మను’ అని ‘మగధీర’లో రామ్‌చరణ్‌ను వంద మందితో ఫైట్ చేయించారు రాజమౌళి. వీళ్ల కాంబినేషన్లో పదేళ్ల తర్వాత వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఈ సంఖ్యను పదింతలు చేశారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’(వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో సుమారు 1000 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ఈ సినిమాలో ఇదే పెద్ద యాక్షన్ సీన్ అనుకుంటే పొరపాటే. దీనికంటే భారీ యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేశారట దర్శకుడు రాజమౌళి. సెకండ్ షెడ్యూల్లో బ్రేక్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తర్వాతి షెడ్యూల్లో జాయిన్ అవుతారట. 1920ల నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారట. ఎన్టీఆర్ సరసన పరిణీతీ చోప్రా, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్లను హీరోయిన్లుగా తీసుకోవాలి అనుకుంటున్నారట చిత్రబృందం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. -
నాగ్-నాని సినిమాలో ఆమెకు గోల్డెన్ చాన్స్!
శ్రద్ధ శ్రీనాథ్.. యూటర్న్, ఆపరేషన్ అలమేలమ్మ, విక్రమ్ వేదా వంటి దక్షిణాది సినిమాలతో దుమ్మురేపిన ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ భామ హే కృష్ణ ముకుంద మురారీ, నిన్ను వదిలి నేను పోలేనులే సినిమాలతోపాటు.. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా శ్రద్ధకు మరో జాక్‌పాట్ తగిలింది. అక్కినేని నాగార్జున-నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలో ఈ అమ్మడికి చాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన నటించే అవకాశం శ్రద్ధకు దక్కింది. ఇటీవలే దర్శకుడు శ్రద్ధకు కథ వినిపించాడని, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఆమె సంతకం చేయలేదని పేర్కొన్నాయి. ఈ నెల 24న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. మార్చి మొదటివారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో నానికి జోడీగా నటించే హీరోయిన్ కోసం ప్రస్తుతం మేకర్లు గాలిస్తున్నారు. -
త్రీ కజిన్స్.. వన్ బ్రదర్ ఓకే!
నితిన్–రానా–నారా రోహిత్ కజిన్స్‌గా నటించనున్నారా? ‘పీఎస్వీ గరుడ వేగ’ హిట్ జోష్‌లో ఉన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా తీయనున్నారా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ఇదే హాట్ టాపిక్. నితిన్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ఆల్రెడీ షురూ అయిన విషయం తెలిసిందే. ఇది మల్టీస్టారర్ మూవీ అని, ఇందులో రానా, నారా రోహిత్ నటించనున్నారనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయం గురించి ప్రవీణ్ సత్తారుని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నానన్నది నిజమే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. కథ రెడీ. ఇందులో ముగ్గురు హీరోలుంటారు. వారిలో నితిన్ ఒక్కరే ఫైనల్. నితిన్‌కి మాత్రమే కథ వినిపించాను. రానా, నారా రోహిత్ నటిస్తున్నారన్నది నిజం కాదు. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు. కొత్త ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ చిత్రానికి ‘3 కజిన్స్’ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. త్రీ కజిన్స్ అంటే హీరోయిన్స్ పాయింటాఫ్ వ్యూలోనూ ఉండొచ్చు. అయితే.. ఈ టైటిల్ హీరోలను ఉద్దేశించి ఫిక్స్ చేసినదే అని భోగట్టా. -
మణిరత్నం మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం
దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని గతంలో దళపతి, అగ్నినక్షత్రం వంటి చిత్రాలు నిరూపించాయి. అదే విధంగా ఆయన రూపొందించిన గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో నాయకన్, దళపతి ముఖ్యమైన చిత్రాలు. సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వంటి స్టార్స్ నటించిన భారీ చిత్రం దళపతి. అరవిందస్వామి యువ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 1991లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా 25 ఏళ్ల తరువాత అలాంటి చిత్రానికి సీక్వెల్‌కు త్వరలో శ్రీకారం పడనుందన్నది తాజా సమాచారం. ఇందులో ఇళయదళపతి విజయ్, సియాన్ విక్రమ్ కలిసి నటించనున్నారన్నదే సెన్సేషనల్ న్యూస్. రజనీకాంత్ పాత్రలో విజయ్, మమ్ముట్టి పాత్రలో విక్రమ్ నటించనున్నారట. కార్తీ, అధితిరావు జంటగా నటిస్తున్న కాట్రు వెలియిడై చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన మణిరత్నం తాజాగా దళపతి–2 చిత్రానికి సంబంధించిన చర్చల్లో నిమగ్నమయ్యారని సమాచారం. అంతే కాదు ఈ చిత్ర కథను ఇటీవల విజయ్, విక్రమ్‌లకు వినిపించగా వారు నటించడానికి రెడీ అన్నట్లు తెలిసింది. విజయ్, విక్రమ్‌లు మంచి స్నేహితులు కావడం వల్లే ఈ మల్టీస్టారర్ చిత్రంలో కలిసి నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. కాగా విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ కథానాయికలు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. తదుపతి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి ముందే మణిరత్నం దర్శకత్వంలో దళపతి–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం చిత్రంలోనూ, విజయ్‌చందర్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. తదుపరి చేసే చిత్రం దళపతి–2 అని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల మాట. -
మల్టీ స్టారర్ చిత్రంగా కరుప్పురాజా వెళ్లైరాజా
ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైందన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం.దక్షిణ భారత నటీనటుల సంఘంలో ప్రధాన బాధ్యతలను నిర్వహిస్తున్న నటుడు విశాల్, కార్తీ కలిసి ఒక చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. విశాల్, కార్తీలకు ఎవరి మార్కెట్ వారికుంది. అలాంటిది వీరిద్దరూ కలిసి నటిస్తే ఆ చిత్రం ఒక సంచలనమే అవుతుంది. ఇక వారికి మరో ప్రముఖ దర్శకుడు తోడైతే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరు. ఎస్ విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రానికి కోలీవుడ్, టాలీవుడ్‌లు దాటి బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకున్న ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. చాలా కాలం తరువాత ఈయన కథానాయకుడిగా నటించిన త్రిభాషా చిత్రం దేవి ఇటీవలే తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరిస్తున్న బోగన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా విశాల్, కార్తీ కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రాన్ని విద్యాసంస్థల అధినేత, దేవి చిత్ర సహ నిర్మాత ఐసరి గ ణేశ్ నిర్మించనున్నట్లు టాక్. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ లోపు విశాల్, కార్తీ తాము అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసుకుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం
కోలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల నిర్మాణ సంఖ్య పెరుగుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే నాగార్జున, కార్తీల చిత్రం, ఆర్య,బాబీసింహా, రానా చిత్రంతో పాటు మరికొన్ని మల్టీస్టారర్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో బాలా దర్శకత్వంలో ఆర్య, అరవింద్‌సామి, అధర్వ, రానా నటించే భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీటి సరసన తాజాగా మరో చిత్రం చేరనుంది. అదే యువ నటులు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్ నటించనున్న చిత్రం.వరుస విజయాలతో నటుడుగా తన స్థాయిని పెంచుకుంటున్న ఉదయనిధిస్టాలిన్ తన తాజా చిత్రం గెత్తు ప్రేక్షకాదరణ పొందడంతో నూతనోత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే మనిదన్ అనే చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు.దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో మరో హీరోగా విష్ణు విశాల్ నటించనున్నారు. ఇది ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 12వ చిత్రం. ఇందులో ఆయన సరసన అంచ్చం ఎంబదు మడమయడా చిత్రం ఫేమ్ మంచిమా మోహన్ నటించనున్నారు. విష్ణు విశాల్‌కు జంటగా నటించే నాయకిని ఎంపిక చేయాల్సి ఉందని దర్శకుడు సుశీంద్రన్ తెలిపారు. ఆయన ఈ చిత్ర వివరాలను వెల్లడిస్తూ వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కథానాయకుడిగా ఎదుగుతున్న ఉదయనిధిస్టాలిన్‌తో చిత్రం చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానన్నారు.అయితే ఆయన స్థాయికి తగ్గ కథ కోసం వేచి ఉన్నానని,అలాంటి కథ ఇప్పటికి లభించడంతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్‌కు తగ్గ పాత్రలో నటుడు విష్ణు విశాల్ నటించనున్నారని తెలిపారు. ఇటీవలే నిరాడంబరంగా పూజాకార్యక్రమాలు నిర్వహించిన ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయిచలేదని, త్వరలోనే కథకు తగ్గ పేరు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. మార్చి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు సుశీంద్రన్ వెల్లడించారు. -
ఐదుగురితో.. అనుష్క
బాల దర్శకత్వంలో భారీ చిత్రం! రిస్క్‌లు తీసుకోవడం తమిళ దర్శకుడు బాలాకి చాలా ఇష్టం అనుకోవచ్చు. కాటి కాపరి, అఘోరా, మెల్ల కన్నోడు... ఇలా ఆయన చిత్రాల్లోని హీరోలు విచిత్రంగా ఉంటారు. హీరోయిన్లను దాదాపు డీ-గ్లామరైజ్డ్గానే చూపిస్తారు. హీరోలంటే హ్యాండ్సమ్గా, హీరోయిన్లంటే గ్లామరస్‌గా ఉంటేనే చూస్తారనే అభిప్రాయాన్ని పోగొట్టి, కథానుగుణంగా ఎలా ఉన్నా చూస్తారని తన చిత్రాల ద్వారా ఆయన చాటి చెప్పారు. ‘శివపుత్రుడు, నేను... దేవుడు, వాడు-వీడు’... ఇలా ఆయన తీసే ప్రతి సినిమా రిస్కే. అందులోనే ఆనందాన్ని వెతుక్కునే బాల ప్రస్తుతం ‘తారై... తప్పట్టై’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రానున్న సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాల తన తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టారని భోగట్టా. ఆ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలెన్నో వినిపిస్తున్నాయి. ఆ విశేషాల్లోకి వెళితే... ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి, విశాల్, రానా, ఆర్య, అధర్వ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీగా దీన్ని బాల ప్లాన్ చేస్తున్నారట. ఇందులో అనుష్కను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని వినికిడి. వచ్చే జనవరిలో ఆరంభించాలనుకుంటున్నారట. బాల దర్శకత్వం వహించిన ‘వాడు-వీడు’లో విశాల్, ఆర్య నటించారు. ‘పరదేశి’లో అధర్వ యాక్ట్ చేశారు. అరవింద్ స్వామి, రానా, అనుష్క మాత్రం ఇప్పటివరకూ ఆయన దర్శకత్వంలో నటించలేదు. సో... వీళ్లను ఓ కొత్త కోణంలో చూడొచ్చని ఊహించవచ్చు. గతంలో తమిళంలో రూపొందిన ‘స్వయంవరం’లో ఎక్కువమంది హీరోలు నటించారు. 24 గంటల్లో తయారైన చిత్రంగా గిన్నిస్ రికార్డు సాధించిన ‘స్వయంవరం’ తర్వాత మళ్ళీ ఎక్కువమంది హీరోలు నటించనున్న చిత్రం ఇదేనని కబురు. ఇవాళ తమిళనాట అగ్ర దర్శకుల్లో బాల ఒకరు. ఇప్పటివరకూ ఆయన తీసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం నిర్మాణ వ్యయం, తారాగణం రీత్యా మరో ఎత్తు అవుతుందని చెన్నై వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, అనుష్కకు మరో వినూత్న, భారీ ప్రాజెక్ట్ వచ్చిందన్నమాట. అనుష్క మజాకా! -
శ్రుతి పాత్రలో తమన్న
శ్రుతిహాసన్ వైదొలగిన చిత్రంలో నటి తమన్న ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా (కార్తీకి జంటగా) నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. అయితే తీరా చిత్ర షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరుణంలో ఆమె చిత్రం చేయడం లేదని చెప్పడం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఆమెపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు పాఠకులకు తెలిసిందే. కొత్త చిత్రాలను అంగీకరించరాదని శ్రుతిపై కోర్టు ఆదేశించిన తరుణంలో ఆమెపై హైదరాబాద్ పోలీసులు కేసును నమోదు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితిలో శ్రుతి వైదొలగిన చిత్రంలో ఆమెకు బదులుగా మిల్కీ బ్యూటీ తమన్న ఎంపికైనట్లు సమాచారం. కాగా కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమి ళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో శ్రుతి హాసన్ పాత్రలో ఆమె బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు తమన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదన్నది గమనార్హం. -
సుబ్బురాజ్ చిత్రంలో ఎస్జే సూర్య
కథా నాయకుడిగా మారిన దర్శకుల్లో ఎస్‌జె సూర్య ఒకరు. ఖుషి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అయితే నటుడిగా కొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఎస్‌జె సూర్య తాజాగా ఇసై చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో ఆయన హీరో, దర్శకుడిగానే కాకుండా అదనంగా సంగీత దర్శకుడిగా కూడా అవతారమెత్తి తన సత్తా చాటుకున్నారు. ఇసై చిత్రం నిర్మాణంలో జాప్యం జరిగినా విడుదలానంతరం మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఎస్ జె సూర్యకు మళ్లీ అవకావాలు వస్తున్నాయి. తాజాగా జిగర్తండా వంటి మంచి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ తాజా చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎస్ జె సూర్యను వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే తన తాజా చిత్ర వివరాలను వెల్లడించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని ఆయన అంటున్నారు. ఈ చిత్రంలోనే యువ నటులు విజయ్ సేతుపతి, బాబి సింహా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు అనధికార సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఇదో చిన్న మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు. -
తెలుగు మల్టీస్టారర్‌లో కార్తీ?
ఆవారా, నా పేరు శివ... తదితర అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ హీరో కార్తీ. ఎప్పట్నుంచో తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రంలో నటిస్తానని చెబుతున్న ఆయన, త్వరలో తెలుగులో ఓ అగ్రహీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని సమాచారం. -
అక్షయ్, రానా కాంబినేషన్లో సినిమా!
హిందీ తెరపై కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు హీరోల్లో రానా ఒకరు. ‘లీడర్’ తర్వాత అతను చేసిన రెండో సినిమా బాలీవుడ్లోనే. అయితే, హిందీలో చేసిన మొదటి సినిమా ‘దమ్ మారో దమ్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా రానాకి మంచి పేరొచ్చింది. ఈ మల్టీస్టారర్ మూవీ తర్వాత మళ్లీ బాలీవుడ్లో ‘డిపార్ట్మెంట్’లో నటించారు రానా. ఇది కూడా మల్టీస్టారరే. అనంతరం ‘ఏ జవానీ హై దివానీ’లో అతిథి పాత్ర చేసిన రానా ఇప్పుడు హిందీలో ముచ్చటగా మూడో మల్టీస్టారర్ మూవీకి పచ్చజెండా ఊపారు. అక్షయ్‌కుమార్, రానా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. విశేషం ఏంటంటే.. ఈ కథ విన్న తర్వాత స్వయంగా అక్షయ్ కుమారే రానా పేరుని సూచించారట. మంచి దేహదారుఢ్యంతో ఉన్న రానా, శక్తిమంతమైన పాత్రలకు పనికొస్తాడనే అభిప్రాయంతో రానాని తీసుకోమన్నారట అక్షయ్. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో నటిస్తూ రానా బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా ‘కవచం’, ‘అబ్బాయిగారు’ అనే చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ రానా చాలా తెలివిగా కెరీర్‌ని మలచుకుంటున్నారని చెప్పొచ్చు. -
‘ఘూమ్కేతు’లో బిగ్ బి
మల్టీస్టారర్ మూవీ ‘ఘూమ్కేతు’లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మెరవనున్నారు. ఉడాన్‌ను నిర్మించిన విక్రమాదిత్య ఈ సినిమాకు నిర్మాత. పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఈ సినిమాలో నా పాత్ర నూటికి నూరుపాళ్లు హాస్య ప్రధానమైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా. ‘ఘూమ్కేతు’లో నా పాత్రకు సంబంధించి పలు అవతారాల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాను’ అని బిగ్‌బీ తన బ్లాగ్‌లో వివరించారు.