కథా నాయకుడిగా మారిన దర్శకుల్లో ఎస్‌జె సూర్య ఒకరు. ఖుషి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అయితే నటుడిగా కొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఎస్‌జె సూర్య తాజాగా ఇసై చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో ఆయన హీరో, దర్శకుడిగానే కాకుండా అదనంగా సంగీత దర్శకుడిగా కూడా అవతారమెత్తి తన సత్తా చాటుకున్నారు. ఇసై చిత్రం నిర్మాణంలో జాప్యం జరిగినా విడుదలానంతరం మంచి ప్రజాదరణ పొందింది.
దీంతో ఎస్ జె సూర్యకు మళ్లీ అవకావాలు వస్తున్నాయి. తాజాగా జిగర్‌తండా వంటి మంచి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ తాజా చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎస్ జె సూర్యను వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే తన తాజా చిత్ర వివరాలను వెల్లడించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని ఆయన అంటున్నారు. ఈ చిత్రంలోనే యువ నటులు విజయ్ సేతుపతి, బాబి సింహా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు అనధికార సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఇదో చిన్న మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు.
సుబ్బురాజ్ చిత్రంలో ఎస్‌జే సూర్య
Published Thu, Feb 19 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement