అక్షయ్, రానా కాంబినేషన్‌లో సినిమా! | Rana signed a Multistarrer with Akshay Kumar? | Sakshi
Sakshi News home page

అక్షయ్, రానా కాంబినేషన్‌లో సినిమా!

Published Sat, Jul 26 2014 10:57 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

అక్షయ్, రానా కాంబినేషన్‌లో సినిమా! - Sakshi

అక్షయ్, రానా కాంబినేషన్‌లో సినిమా!

 హిందీ తెరపై కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు హీరోల్లో రానా ఒకరు. ‘లీడర్’ తర్వాత అతను చేసిన రెండో సినిమా బాలీవుడ్‌లోనే. అయితే, హిందీలో చేసిన మొదటి సినిమా ‘దమ్ మారో దమ్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా రానాకి మంచి పేరొచ్చింది. ఈ మల్టీస్టారర్ మూవీ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో ‘డిపార్ట్‌మెంట్’లో నటించారు రానా. ఇది కూడా మల్టీస్టారరే. అనంతరం ‘ఏ జవానీ హై దివానీ’లో అతిథి పాత్ర చేసిన రానా ఇప్పుడు హిందీలో ముచ్చటగా మూడో మల్టీస్టారర్ మూవీకి పచ్చజెండా ఊపారు.
 
 అక్షయ్‌కుమార్, రానా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. విశేషం ఏంటంటే.. ఈ కథ విన్న తర్వాత స్వయంగా అక్షయ్ కుమారే రానా పేరుని సూచించారట. మంచి దేహదారుఢ్యంతో ఉన్న రానా, శక్తిమంతమైన పాత్రలకు పనికొస్తాడనే అభిప్రాయంతో రానాని తీసుకోమన్నారట అక్షయ్. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో నటిస్తూ రానా బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా ‘కవచం’, ‘అబ్బాయిగారు’ అనే చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ రానా చాలా తెలివిగా కెరీర్‌ని మలచుకుంటున్నారని చెప్పొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement