బాబీ పేరు ఎందుకు పెట్టారో? | Was surprised by the title of 'Baby' initially, says Akshay Kumar | Sakshi
Sakshi News home page

బాబీ పేరు ఎందుకు పెట్టారో?

Published Thu, Dec 4 2014 3:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాబీ పేరు ఎందుకు పెట్టారో? - Sakshi

బాబీ పేరు ఎందుకు పెట్టారో?

ముంబై: యాక్షన్ థిల్లర్ సినిమాకు 'బాబీ' పేరు పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు బాబీ పేరు ఎందుకు పెట్టారో మొదట్లో తనకు అర్థం కాలేదని, తర్వాత మెల్లగా అర్థమైందన్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రత్యేక అధికారి పాత్రలో నటించారు.

'మొదట ఈ కథ వినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. తర్వాత బాబీ పేరు ప్రాధాన్యం అర్థమైంది. ఇందులో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నా' అని అక్షయ కుమార్ తెలిపారు.

నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'బాబీ'లో అనుమప్ ఖేర్, దగ్గుబాటి రానా, తాప్సీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది జనవరి 23న ఈ సినిమా విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement