తొలి రోజే రూ. 9.3 కోట్లు! | baby movie mints rs. 9.3 crores on first day | Sakshi
Sakshi News home page

తొలి రోజే రూ. 9.3 కోట్లు!

Published Sat, Jan 24 2015 6:58 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

తొలి రోజే రూ. 9.3 కోట్లు!

తొలి రోజే రూ. 9.3 కోట్లు!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బేబీ' సినిమా తొలిరోజే బాక్సాఫీసును కొల్లగొట్టింది. విడుదల అయ్యిందో.. లేదో, మొదటిరోజే ఏకంగా రూ. 9.3 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాలో పాకిస్థాన్ను నేరుగా విమర్శించినట్లు కథనాలు వచ్చాయి. అయినా.. వసూళ్లలో మాత్రం ఈ సినిమా ఏమీ వెనకడుగు వేయలేదు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చేసే అండర్ కవర్ ఆపరేషన్ ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సెలవలు కాకపోయినా.. పెద్దగా ప్రచారం లేకపోయినా కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎ వెడ్నస్ డే లాంటి చిత్రాలు తీసిన నీరజ్ పాండే పేరు దీనికి బాగా ఉపయోగపడింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటులు దగ్గుబాటి రాణా, తాప్సీలతో పాటు.. సీనియర్ విలన్ డేనీ డెంజోంగ్పా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement