తెలుగు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ | Akshay Kumar Guest role in Rana Poster Boys | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్

Published Sun, Jan 31 2016 4:17 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

తెలుగు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ - Sakshi

తెలుగు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సౌత్ ఇండస్ట్రీ మీద మనుసు పడ్డాడు. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్లో విలన్గా నటిస్తున్న అక్షయ్ తెలుగులోనూ నటించడానికి అంగీకరించాడు. ఎయిర్ లిఫ్ట్ సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న అక్షయ్, ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే జోష్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబో 2లో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం రెడీ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు.

రోబో సినిమాతో పాటు ఓ తెలుగు సినిమాలో కూడా నటించడానికి అంగీకరించాడు అక్షయ్. యంగ్ హీరో రానా తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న పోస్టర్ బాయ్స్ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించాడు. రానా, అక్షయ్లు బేబి సినిమాలో కలిసి నటించారు. ఆ స్నేహంతో రానా సినిమాలో నటించడానికి అంగీకరించిన అక్షయ్, మంచి కథ దొరికితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement