రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ | Akshay Kumar, Rana Daggubati to present Telegu film "Poster Boyz" | Sakshi
Sakshi News home page

రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్

Published Thu, Aug 6 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్

రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్

 బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, టాలీవుడ్ హీరో రానాకి మధ్య మంచి స్నేహం ఉంది. అక్షయ్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘బేబీ’లో రానా అతిథి పాత్ర చేశారు. అప్పుడే ఈ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా నిర్మించేంతగా క్లోజ్ అయిపోయారు. అక్షయ్‌కుమార్, రానా సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ‘పోస్టర్ బాయ్స్’. మరాఠీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘పోస్టర్ బాయ్స్’ని అదే పేరుతో తెలుగులోకి పునర్నిర్మిస్తున్నారు.
 
  గోపీ గణేశ్ దర్శకుడు. వచ్చే నెల చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం నూతన తారలను ఎంపిక చేసే పని మీద ఉన్నారు. అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌ని బాగా ఇష్టపడతారని తెలుసు. అందుకే, రానాతో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రానా నాకు మంచి మిత్రుడు’’ అన్నారు. రానా మాట్లాడుతూ - ‘‘మంచి మంచి కాన్సెప్ట్‌లతో వినూత్న తరహా చిత్రాలు నిర్మించాలన్నది నా కోరిక. ‘పోస్టర్ బాయ్స్’ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే అక్షయ్‌తో కలిసి నిర్మిస్తున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వీరేన్ తంబిదొరై.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement