మల్టీ స్టారర్ చిత్రంగా కరుప్పురాజా వెళ్లైరాజా | Multi-starrer Movie on Kollywood heroes | Sakshi
Sakshi News home page

మల్టీ స్టారర్ చిత్రంగా కరుప్పురాజా వెళ్లైరాజా

Published Wed, Oct 19 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

మల్టీ స్టారర్ చిత్రంగా కరుప్పురాజా వెళ్లైరాజా

మల్టీ స్టారర్ చిత్రంగా కరుప్పురాజా వెళ్లైరాజా

 ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైందన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం.దక్షిణ భారత నటీనటుల సంఘంలో ప్రధాన బాధ్యతలను నిర్వహిస్తున్న నటుడు విశాల్, కార్తీ కలిసి ఒక చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. విశాల్, కార్తీలకు ఎవరి మార్కెట్ వారికుంది. అలాంటిది వీరిద్దరూ కలిసి నటిస్తే ఆ చిత్రం ఒక సంచలనమే అవుతుంది. ఇక వారికి మరో ప్రముఖ దర్శకుడు తోడైతే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరు.
 
  ఎస్ విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రానికి కోలీవుడ్, టాలీవుడ్‌లు దాటి బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకున్న ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. చాలా కాలం తరువాత ఈయన కథానాయకుడిగా నటించిన త్రిభాషా చిత్రం దేవి ఇటీవలే తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరిస్తున్న బోగన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
 
  కాగా విశాల్, కార్తీ కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రాన్ని విద్యాసంస్థల అధినేత, దేవి చిత్ర సహ నిర్మాత ఐసరి గ ణేశ్ నిర్మించనున్నట్లు టాక్. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ లోపు విశాల్, కార్తీ తాము అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసుకుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement