మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం | Arvind Swami, Rana Daggubati and Arya to act in Bala's next | Sakshi
Sakshi News home page

మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం

Published Fri, Jan 22 2016 1:51 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం - Sakshi

మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం

కోలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల నిర్మాణ సంఖ్య పెరుగుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే నాగార్జున, కార్తీల చిత్రం, ఆర్య,బాబీసింహా, రానా చిత్రంతో పాటు మరికొన్ని మల్టీస్టారర్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో బాలా దర్శకత్వంలో ఆర్య, అరవింద్‌సామి, అధర్వ, రానా నటించే భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీటి సరసన తాజాగా మరో చిత్రం చేరనుంది. అదే యువ నటులు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్ నటించనున్న చిత్రం.వరుస విజయాలతో నటుడుగా తన స్థాయిని పెంచుకుంటున్న ఉదయనిధిస్టాలిన్ తన తాజా చిత్రం గెత్తు ప్రేక్షకాదరణ పొందడంతో నూతనోత్సాహంతో ఉన్నారు.
 
  ఇప్పటికే మనిదన్ అనే చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు.దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో మరో హీరోగా విష్ణు విశాల్ నటించనున్నారు. ఇది ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 12వ చిత్రం. ఇందులో ఆయన సరసన అంచ్చం ఎంబదు మడమయడా చిత్రం ఫేమ్ మంచిమా మోహన్ నటించనున్నారు. విష్ణు విశాల్‌కు జంటగా నటించే నాయకిని ఎంపిక చేయాల్సి ఉందని దర్శకుడు సుశీంద్రన్ తెలిపారు.
 
 ఆయన ఈ చిత్ర వివరాలను వెల్లడిస్తూ వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కథానాయకుడిగా ఎదుగుతున్న ఉదయనిధిస్టాలిన్‌తో చిత్రం చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానన్నారు.అయితే ఆయన స్థాయికి తగ్గ కథ కోసం వేచి ఉన్నానని,అలాంటి కథ ఇప్పటికి లభించడంతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్‌కు తగ్గ పాత్రలో నటుడు విష్ణు విశాల్ నటించనున్నారని తెలిపారు. ఇటీవలే నిరాడంబరంగా పూజాకార్యక్రమాలు నిర్వహించిన ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయిచలేదని, త్వరలోనే కథకు తగ్గ పేరు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. మార్చి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు సుశీంద్రన్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement