
నాని
‘జెర్సీ’ మూవీ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నాని మ్యాచ్‌ని ముగించారు. గేమ్‌లో బంతులను ఎలా బౌండరీ దాటించారో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే మరి. నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పీడీవి ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్ ‘అర్జున్’ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం పూర్తయింది. ‘‘ఇప్పుడే ‘జెర్సీ’ లాస్ట్ షాట్ పూర్తి చేశాం’’ అంటూ నాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. అనిరుథ్ స్వరాలు అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్యాంగ్‌లీడర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment