కృష్ణ అండ్ హిజ్ లీల.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే వ్యక్తి అనేక మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ దేవత పేరు పెట్టుకున్న రాధను కూడా బాధితురాలిగా చూపించారని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలకు హిందూ దైవాల పేర్లు వినియోగించడమే కాక, హిందూ మతాన్ని కించపరిచే వాటిని ప్రోత్సహిస్తుందంటూ నెట్‌ఫ్లిక్స్‌పై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. దీంతో ట్విటర్‌లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది. (‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ ఫస్ట్‌లుక్ టీజర్)
"ఇంతకుముందు వచ్చిన సాక్క్‌డ్ గేమ్స్, లైలా, ఘౌల్, ఢిల్లీ క్రైమ్ వంటి పలు వెబ్ సిరీస్లు హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించింది. ఇప్పుడొచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల కూడా హిందూ దేవుళ్లను కించపరుస్తోంది", "మా డబ్బుతో, మా విశ్వాసాలకు వ్యతిరేకంగా వెబ్ సిరీస్‌లు తీసేందుకు నెట్‌ఫ్లిక్స్‌కుఎంత ధైర్యం? ఒక మనిషిని చంపడం కన్నా వారి నమ్మకాన్ని చంపడమే పెద్ద నేరం. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించం" అంటూ నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం దీనిపై మీమ్స్ చేస్తూ సమస్యను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన "కృష్ణ అండ్ హిజ్ లీల" చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. శ్రద్దా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. (మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హ్యాక్!)
Comments
Please login to add a commentAdd a comment