నన్నలా కోరుకోవడం లేదు! | Shraddha Srinath to be the heroine for Udhayanidhi Stalin | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 20 2017 10:45 AM | Last Updated on Wed, Dec 20 2017 10:45 AM

Shraddha Srinath to be the heroine for Udhayanidhi Stalin - Sakshi

తమిళ సినిమా: ప్రేక్షకులు తననలా కోరుకోవడం లేదని నటి శ్రద్ధా శ్రీనాథ్‌ అంటోంది. మొదట న్యాయవాది వృత్తిని చేపట్టి ఆపై మోడల్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ కోహినూర్‌ అనే మలయాళ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసింది. అయితే మాతృభాషలో నటించిన యూటర్న్‌ చిత్రం శ్రద్ధా శ్రీనాథ్‌ కెరీర్‌ను ఒక్కసారిగా పెద్ద మలుపు తిప్పేసింది. అక్కడ సంచలన విజయం సాధించిన ఆ చిత్రం ఇప్పుడు నయనతార హీరోయిన్‌గా కోలీవుడ్‌లోనూ, సమంత నాయకిగా టాలీవుడ్‌లోనూ రీమేక్‌ కానుంది.

ఆ మధ్య ఏస్‌ డైరెక్టర్‌ మణిరత్నం దృష్టిలో పడి కాట్రువెలియిడై చిత్రంలో నటించేసిన ఈ అమ్మడికిప్పుడు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. కన్నడంలో బిజీగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్‌ ఇప్పుడు తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది.  కాట్రువెలియిడై చిత్రం తరువాత కోలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నా హీరోలతో నాలుగు రొమాన్స్‌ సీన్స్, నాలుగు డ్యూయెట్లు పాడే పాత్రల్లో నటించడం తనకిష్టం లేదంటోంది శ్రద్ధా. అభిమానులకు తనను అలా చూడటానికి ఇష్టపడరని తెలిపింది.

అలాగని చిత్రంలో ప్రతి ఫేమ్‌లోనూ తాను కనిపించాలని ఆశించనని, నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే అంగీకరిస్తానని అంది. ఇలాంటి పాత్రనే ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించనున్నట్లు చెప్పింది. దీనికి పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించనున్నారని తెలిపింది. ప్రస్తుతం ఈయన విశాల్, సమంత జంటగా నటిస్తున్న ఇరుంబు తెరై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement