
తన అందాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని నాని జెర్సి మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బ్యూటీ విక్రం వేదా చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయమైందిఈ బెంగళూరు బ్యూటీ. ఆ మూవీ విజయంతో ఆమెకు ఇక్కడ అనేక అవకాశాలు వచ్చాయి. అలా ఆమె అజిత్ కథానాయకుడుగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదేవిధంగా మాధవన్‌కు జంటగా మారా అనే చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. జెర్సీ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకుంది. అదేవిధంగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
చదవండి: ‘గీత ఆర్ట్స్’ బ్యానర్‌లో గీత ఎవరో చెప్పిన అల్లు అరవింద్
అయితే 2015లో నటిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇంకా స్టార్ ఇమేజ్‌ను మాత్రం పొందలేదనే చెప్పాలి. అదేవిధంగా చేతిలో ప్రస్తుతం పెద్దగా చిత్రాలు కూడా లేవు. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామర్ మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఫొటో షూట్ ఏర్పాటు చేసుకుని తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలను దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది. దీంతో వారు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల మాట్లాడుతూ తన అందమైన ముఖాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని అందుకే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment