బాలీవుడ్‌కి టర్న్‌ | Milan Talkies: Ali Fazal, Shraddha Srinath Star in this Desi Love Story | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కి టర్న్‌

Published Wed, Feb 20 2019 1:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

 Milan Talkies: Ali Fazal, Shraddha Srinath Star in this Desi Love Story - Sakshi

‘యు–టర్న్‌’ సినిమాతో ఆడియన్స్‌తో పాటు దర్శక–నిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. ఆ తర్వాత ఆమెకు తమిళ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న ‘జెర్సీ’ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌నే కథానాయిక అన్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో అజిత్‌ నటిస్తున్న ‘పింక్‌’ రీమేక్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారామె. కన్నడంలో ‘కే–13’ అనే సినిమాలో కూడా శ్రద్ధానే హీరోయిన్‌. ఇలా సౌత్‌ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె బాలీవుడ్‌కు ‘మిలాన్‌ టాకీస్‌’ అనే లవ్‌స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నారు.

ఇందులో అలీ ఫజల్‌ హీరోగా నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘పాన్‌ సింగ్‌ తోమర్‌’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన తిగ్మాంషు ధూలియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్‌ మిశ్రా, అశుతోష్‌ రానా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ రోజు ట్రైలర్‌ విడుదల అవుతుంది.‘‘బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మంగళవారం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశాం. బుధవారం ట్రైలర్‌ విడుదలవుతోంది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ చిత్రం మార్చి 15న విడుదల కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement