శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్‌తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు..
► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకుంది.
► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్‌గా పనిచేసింది.
► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్‌కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్‌ను ఆమె సీరియస్‌గా తీసుకునేలా చేసింది.
► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌నూ అందుకుంది.
► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది.
► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్‌ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్‌తెర చాన్స్‌లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్
Comments
Please login to add a commentAdd a comment