
నాగచైతన్య
బ్రేక్ వేయకుండా రయ్‌రయ్ మంటూ కెరీర్ ఎక్సలేటర్‌ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌లో వెంకటేశ్‌తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు.
‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్ బిజీబిజీ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment