శ్రద్ధాశ్రీనాథ్
సౌత్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్. తాజాగా కన్నడలో మరో సినిమాకు సై అన్నారీ బ్యూటీ. సుదీప్ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్‌వుడ్ టాక్. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్’తో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment