Phantom movie
-
సుదీప్‌కు జోడీ
సౌత్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్. తాజాగా కన్నడలో మరో సినిమాకు సై అన్నారీ బ్యూటీ. సుదీప్ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్‌వుడ్ టాక్. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్’తో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
ఫాంటమ్.. పాక్‌కు వ్యతిరేకంకాదు
ఉగ్రవాదం ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఫాంటామ్ చలనచిత్రాన్ని పాకిస్థాన్ కోర్టు నిషేధించడంపై ఆ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. ఫాంటమ్ సినిమా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిందేతప్ప పాకిస్థాన్‌కు వ్యతిరేకం కాదని శుక్రవారం మీడియాతో అన్నారు. ఫాంటమ్లో తనను ఉద్దేశించి అసత్యాలు చెప్పారని ఆరోపిస్తూ సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందిగా లష్కరే తాయిబా నేత హఫీజ్ సయ్యద్ కోర్టును ఆశ్రయించడం.. విచారించిన కోర్టు పాకిస్థాన్‌లో ఫాంటమ్ సినిమాను నిషేధిస్తున్నట్లు గురువారం ప్రకటించడం తెలిసిందే. 'సినిమా విడుదల కాకముందే.. కనీసం అందులో ఏం చూపించానో తెలుసుకోకుండానే ఫాంటమ్ పై నిషేధం విధించారు. పాకిస్థాన్ కోర్టు నిర్ణయం నన్ను షాక్ కు గురిచేసింది. ఏ వ్యక్తిని కూడా కించపర్చే ఉద్దేశం నాకు లేదు. ఈ సినిమా ఉగ్రవాదానికి వ్యతిరేకమేకానీ, పాకిస్థాన్ కు కాదు' అని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. 26/11 ముంబై దాడులు, వాటి వెనకున్న అసలు వ్యక్తులు తదితర ఆసక్తికర అంశాల చుట్టూ తిరిగే ఫాంటమ్ కథలో సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
'అతడు చెడ్డ సినిమా తీయడు'
ముంబై: దర్శకుడు కబీర్ ఖాన్ కు హీరో సల్మాన్ ఖాన్ బాసటగా నిలిచాడు. అతడు చెడ్డ సినిమా తీయడని సమర్థించాడు. కబీర్ ఖాన్ తాజా చిత్రం 'పాంథమ్'ను పాకిస్థాన్ లో నిషేధించాలని కోరుతూ హైకోర్టులో జమాత్-వుద్-దవాహ్ చీఫ్ హఫీజ్ సయీద్ పిటిషన్ వేశాడు. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు. 'పాంథమ్ సినిమా ఇంకా చూడలేదు. దీని గురించి కామెంట్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. కబీర్ ఖాన్ చెడ్డ సినిమా తీయడని నా నమ్మకం. అతడు చాలా నిజాయితీ పరుడు' అని విలేకరులతో సల్మాన్ చెప్పాడు. ఎస్ హుస్సేన్ జైదీ నవల 'ముంబై ఎవెంజర్స్' ఆధారంగా 'పాంథమ్'ను తెరకెక్కించారు. సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. కాగా, తన సినిమాను పాకిస్థాన్ లో నిషేధించాలని కోర్టుకు ఎక్కడం ఆశ్చర్యం కలిగించలేదని సైఫ్ అలీఖాన్ అన్నాడు. తన గత చిత్రం 'ఏజెంట్ వినోద్'ను పాకిస్థాన్ లో నిషేధించిన విషయాన్ని గుర్తు చేశాడు. -
'కత్రినా కైఫ్ గాళ్ ఫ్రెండ్ గా ఉంటే...'
ముంబై: హీరోయిన్ కత్రినా కైఫ్ ను నటుడు సైఫ్ అలీఖాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కత్రినా కైఫ్ గాళ్ ఫ్రెండ్ గా ఉంటే ఎవరైనా అదృష్టవంతులేనని అన్నాడు. తనతో కలిసి నటించిన అందమైన భామల్లో కత్రినా ఒకరని కితాబిచ్చాడు. 'ఫాంతమ్' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. కత్రినా కైఫ్ దేశంలోనే పెద్ద స్టార్ అవుతుందని 'రేస్' సినిమాలో చేసే సమయంలోనే ఊహించానని సైఫ్ వెల్లడించాడు. తెరపై సన్నివేశాలు పండించేందుకు ఆమె కష్టపడుతుందని తెలిపాడు. ఆమెతో మాట్లాడడం, కలిసి పనిచేయడం తనకెంతో ఇష్టమని చెప్పాడు. తామిద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయన్నాడు. 'బుల్లెట్ రాజా' తర్వాత సైఫ్ అలీ ఖాన్ చేసిన యాక్షన్ సినిమా 'ఫాంతమ్'. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది.