'కత్రినా కైఫ్ గాళ్ ఫ్రెండ్ గా ఉంటే...'
ముంబై: హీరోయిన్ కత్రినా కైఫ్ ను నటుడు సైఫ్ అలీఖాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కత్రినా కైఫ్ గాళ్ ఫ్రెండ్ గా ఉంటే ఎవరైనా అదృష్టవంతులేనని అన్నాడు. తనతో కలిసి నటించిన అందమైన భామల్లో కత్రినా ఒకరని కితాబిచ్చాడు. 'ఫాంతమ్' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు.
కత్రినా కైఫ్ దేశంలోనే పెద్ద స్టార్ అవుతుందని 'రేస్' సినిమాలో చేసే సమయంలోనే ఊహించానని సైఫ్ వెల్లడించాడు. తెరపై సన్నివేశాలు పండించేందుకు ఆమె కష్టపడుతుందని తెలిపాడు. ఆమెతో మాట్లాడడం, కలిసి పనిచేయడం తనకెంతో ఇష్టమని చెప్పాడు. తామిద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయన్నాడు.
'బుల్లెట్ రాజా' తర్వాత సైఫ్ అలీ ఖాన్ చేసిన యాక్షన్ సినిమా 'ఫాంతమ్'. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది.