'అతడు చెడ్డ సినిమా తీయడు'
ముంబై: దర్శకుడు కబీర్ ఖాన్ కు హీరో సల్మాన్ ఖాన్ బాసటగా నిలిచాడు. అతడు చెడ్డ సినిమా తీయడని సమర్థించాడు. కబీర్ ఖాన్ తాజా చిత్రం 'పాంథమ్'ను పాకిస్థాన్ లో నిషేధించాలని కోరుతూ హైకోర్టులో జమాత్-వుద్-దవాహ్ చీఫ్ హఫీజ్ సయీద్ పిటిషన్ వేశాడు. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు.
'పాంథమ్ సినిమా ఇంకా చూడలేదు. దీని గురించి కామెంట్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. కబీర్ ఖాన్ చెడ్డ సినిమా తీయడని నా నమ్మకం. అతడు చాలా నిజాయితీ పరుడు' అని విలేకరులతో సల్మాన్ చెప్పాడు. ఎస్ హుస్సేన్ జైదీ నవల 'ముంబై ఎవెంజర్స్' ఆధారంగా 'పాంథమ్'ను తెరకెక్కించారు.
సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. కాగా, తన సినిమాను పాకిస్థాన్ లో నిషేధించాలని కోర్టుకు ఎక్కడం ఆశ్చర్యం కలిగించలేదని సైఫ్ అలీఖాన్ అన్నాడు. తన గత చిత్రం 'ఏజెంట్ వినోద్'ను పాకిస్థాన్ లో నిషేధించిన విషయాన్ని గుర్తు చేశాడు.