నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్ | salman khan did not get his share for bajrangi bhaijaan | Sakshi
Sakshi News home page

నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్

Published Tue, Jan 12 2016 6:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్

నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్

అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి తనకు ఇంకా రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద 'మా'లో ఫిర్యాదు చేశారు హీరో పవన్ కల్యాణ్. కానీ.. 2015 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బజరంగీ భాయీజాన్ సినిమాకు సంబంధించి సల్మాన్ ఖాన్‌కు ఆ సినిమా నిర్మాత ఇంకా ఏకంగా రూ. 35 కోట్లు బాకీ ఉన్నారట.

కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసును మోత మోగించి.. మన దేశంలోనే దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో మరో రూ. 300 కోట్లు కలిపి, మొత్తం రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా.. అంత భారీ కలెక్షన్లు వసూలుచేసినా, ఇప్పటికీ తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంపై సల్లూభాయ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement