కపిల్ బయోపిక్లో సల్మాన్ | Salman Khan To Play Kapil Dev In biopic movie | Sakshi
Sakshi News home page

కపిల్ బయోపిక్లో సల్మాన్

Published Tue, Oct 18 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

కపిల్ బయోపిక్లో సల్మాన్

కపిల్ బయోపిక్లో సల్మాన్

బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అజారుద్దీన్, ధోని లాంటి క్రికెట్ వీరుల జీవితాలు వెండితెర మీద సందడి చేయగా త్వరలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జీవితకథ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈనేపధ్యంలో మరో క్రికెట్ లెజెండ్ కథను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు.

ఇండియన్ క్రికెట్ టీంకు తొలి ప్రపంచ కప్ను అందించిన క్రికెట్ వీరుడు కపిల్ దేవ్ జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్లైట్ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఆ తరువాత కపిల్ బయోపిక్లో నటించే అవకాశం ఉంది. ఈ బయోపిక్ కూడా కబీర్ దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement