ఐఏఎస్‌ ఆఫీసర్‌గా.. | Shraddha Srinath to play an IAS officer in Mohanlal starrer | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ ఆఫీసర్‌గా..

Published Thu, Oct 29 2020 12:52 AM | Last Updated on Thu, Oct 29 2020 12:52 AM

Shraddha Srinath to play an IAS officer in Mohanlal starrer - Sakshi

‘జెర్సీ’ చిత్రంలో మిడిల్‌క్లాస్‌ హౌస్‌వైఫ్‌ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. తాజాగా మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘పులిమురుగన్‌’ ఫేమ్‌ బి. ఉన్నికృష్ణన్‌ దర్శకుడు. శ్రద్ధాకు ఫోన్‌లో ఈ కథను చెప్పారట దర్శకుడు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఎక్కువ డేట్స్‌ను ఈ సినిమాకు కేటాయించారట శ్రద్ధా. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విశాల్‌తో ‘చక్ర’, మాధవన్‌తో ‘మారా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో శ్రద్ధా శ్రీనాథ్‌ బిజీ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement