
గత రెండు సినిమాలతో కమర్షియల్ బాట పట్టిన నాని.. మళ్లీ తన ట్రాక్‌లోకి వచ్చేశాడు. కమర్షియల్ చిత్రాలు తనకు కలిసి రావని.. మళ్లీ ప్రయోగానికి ఓటేశాడు. నాని క్రికెటర్‌గా నటిస్తున్న జెర్సీ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.
ఈ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్స్ ఈ వారంలోనే ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు. టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ఈ చిత్రంలో.. ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ పాత్రను నాని పోషిస్తున్నారు. కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ⚡ #HappyUgadi
— Sithara Entertainments (@SitharaEnts) April 6, 2019
Pad up for the Theatrical Trailer, Jukebox & Pre - Release updates coming this week.
We are ready 🔥 #JERSEY @NameisNani @ShraddhaSrinath @gowtam19 @anirudhofficial @vamsi84 pic.twitter.com/jkaDoK41kp
Comments
Please login to add a commentAdd a comment