Fashion: శ్రద్ధ శ్రీనాథ్‌ ధరించిన ఈ డ్రెస్‌ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ? | Fashion: Shraddha Srinath In Raw Mango Pink Salwar Price 32K Look At | Sakshi
Sakshi News home page

Shraddha Srinath: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?

Published Mon, Jul 25 2022 5:10 PM | Last Updated on Mon, Jul 25 2022 5:55 PM

Fashion: Shraddha Srinath In Raw Mango Pink Salwar Price 32K Look At - Sakshi

పింక్‌ సల్వార్‌... ముత్యాల లోలాకులు.. గాజులతో మెరిసిపోతున్న ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టే ఉంటారు. ‘మేమూ జెర్సీ సినిమా చూశాం లెండి’ అంటారా! అవునవును.. ఆ చిత్ర కథానాయికే ఈమె.. శ్రద్ధ శ్రీనాథ్‌. తెలుగుతోపాటు తన మాతృ భాష కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.

వచ్చిన అవకాశాల్లో తాను మెచ్చిన పాత్రలకే ఓకే చెప్తుంది. వాసికే ఆమె ప్రాధాన్యం. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్‌ గురించి పెద్దగా పట్టించుకునేది కాదుట. సినిమాల్లోకి వచ్చాకే ఫ్యాషన్‌ మీద శ్రద్ధ పెరిగింది అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్‌ ఫాలో అయ్యే బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం...

రా మ్యాంగో
చేనేతకు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్‌ ఇది. ఫ్యాషన్‌ ప్రపంచంలో దీని ప్రయాణం 2008లో మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వారణాసి మొదలైన ప్రాంతాల్లోని చేనేత కళతో అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను డిజైన్‌చేయడం రా మ్యాంగో ప్రత్యేకత. ఆన్‌లైన్‌లో లభ్యం. 

బ్రాండ్‌ వాల్యూ
డ్రెస్‌ బ్రాండ్‌: రా మ్యాంగో
ధర: రూ. 32,800

BCOS  ఇట్స్‌ సిల్వర్‌ 
బి అంటే బ్రాస్‌.. సీఓ అంటే కాపర్‌.. ఎస్‌ అంటే సిల్వర్‌... మొత్తంగా బికాజ్‌ ఇట్స్‌ సిల్వర్‌ బ్రాండ్‌. 2010లో.. ఇంట్లో మొదలై ఈ రోజు బెంగళూరులోని అతి పెద్ద జ్యూయెలరీ షో రూమ్‌ స్థాయికి ఎదిగిందీ బ్రాండ్‌. ఫ్లారెన్స్‌ ఎస్తర్, ప్రిసిల్లా పాల్, సిండ్రెల్లా రెంజి.. ఈ ముగ్గురు దీని వ్యవస్థాపకులు. ఆధునిక మహిళల అవసరాలు.. ఆలోచనలు.. అభిరుచులకు నాణ్యత, కళను మేళవించి రూపుదిద్దుకునేవే ఆఇౖ  ఇట్స్‌ సిల్వర్‌ డిజైన్స్‌. ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. 

జ్యూయెలరీ
బ్రాండ్‌: BCOS  ఇట్స్‌ సిల్వర్‌
ధర: రూ. 14,430

అందం, ఆరోగ్యం రెండూ వేర్వేరు కాదు. ఆరోగ్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టిపడుతుంది. అందుకే నా దృష్టిలో ఆరోగ్యమే అందం!  – శ్రద్ధ శ్రీనాథ్‌ 
చదవండి: Fashion: వేడుకల వేళ.. కాటన్‌ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement