అద్భుతమైన భావోద్వేగాలతో ‘జెర్సీ’! | Shraddha Srinath Says Jersey is Filled With Honest Emotions | Sakshi
Sakshi News home page

అద్భుతమైన భావోద్వేగాలతో ‘జెర్సీ’!

Apr 14 2019 4:21 PM | Updated on Apr 14 2019 4:21 PM

Shraddha Srinath Says Jersey is Filled With Honest Emotions - Sakshi

అందంలో అభినయంలో తనకంటూ ఓ  ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న  ప్రతిభావంతురాలైన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్. జెర్సీ  సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్‌గా  తెలుగు తెరకు పరిచయం అవుతోందీ కన్నడ బ్యూటీ. మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జెర్సీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రద్ధా శ్రీనాథ్‌...  జెర్సీ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో తనకు  అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చింది. 

అలాగే సినిమాలో టీనేజర్ గా మరియు ఒక మదర్ గా ఇలా వేరు వేరు దశలలో కనిపిస్తానని తెలిపింది. ఇక  నాని పక్కన నటించడం గురించి చెప్తూ.. నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే లో చక్కని హావబావాలతో  నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిసింది.

అదేవిధంగా ఈ సినిమా ఒప్పుకోవడానికి నానితో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, అనిరుధ్ లతో  మొత్తం చిత్రబృందం కూడా కారణమని.. వారి పనితనం వల్లే  జెర్సీ సినిమా  అద్భుతంగా వచ్చిందని  శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.కాగా  కొన్ని సంవత్సరాలు పాటు  హైదరాబాద్  లోనే  పెరిగిన శ్రద్ధ..  ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement