
నేచురల్ స్టార్‌గా మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. వరుస విజయాలకు బ్రేక్ పడటంతో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్లీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా తెలిపారు. అదే రోజు నాగచైతన్య, సమంతల మజిలి కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ సారి రసవత్తర పోటి తప్పదని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జెర్సీ విడుదల వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
నాగచైతన్య, నాని.. ఇద్దరి కెరీర్‌లకు హిట్ కీలకం కావటంతో అనవసరమై పోటి వద్దన్న ఉద్దేశంతో జెర్సీని కాస్త ఆలస్యంగా విడుదల చేసే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా జెర్సీ వాయిదా దాదాపు కన్ఫామ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment