కేవలం మీకోసం చేయండి | Shraddha Srinath opens about her weight loss | Sakshi
Sakshi News home page

కేవలం మీకోసం చేయండి

Published Tue, Oct 22 2019 2:48 AM | Last Updated on Tue, Oct 22 2019 2:48 AM

Shraddha Srinath opens about her weight loss - Sakshi

అంతకుముందు... ఆ తర్వాత

‘‘నాలుగేళ్ల క్రితం నేను ఉండాల్సిన దానికంటే కొంచెం బరువు ఎక్కువే ఉన్నాను. అలా ఉండటానికి నేనేం ఇబ్బంది పడలేదు. మునుపటి కంటే లుక్స్‌ పరంగా బావుండాలనే ఉద్దేశంతో వర్కౌట్‌ మొదలుపెట్టాను. ‘గుడ్‌ లుక్స్‌’కి అంతం అనేది ఉండదు’’ అని శ్రద్ధా శ్రీనాథ్‌ అన్నారు. ఈ ఏడాది ‘జెర్సీ’ సినిమాలో తన నటనకు మంచి ప్రసంశలు పొందారు ఈ కన్నడ బ్యూటీ. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుత ఫొటోను, నాలుగేళ్ల క్రితం ఫొటోను పోస్ట్‌ చేసి శారీరకంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. ‘

‘లాయర్‌గా ఉద్యోగం వచ్చి, 2014లో నా తొలి ఇంటర్నేషనల్‌ హాలిడేకు (బాలి) Ðð ళ్లినప్పుడు దిగిన ఫొటో అది. ఉద్యోగంతో నా లైఫ్‌ స్టయిల్‌ మారిపోయింది. నాకు నచ్చినంత తినేదాన్ని. నన్ను నేను బాగా కష్టపడి మోటివేట్‌ చేసుకొని నెలకోసారి జిమ్‌కి వెళ్లేదాన్ని. చేతులు బొద్దుగా ఉన్నాయి అని సంకోచించకుండా నాకు నచ్చిన దుస్తులు వేసుకునేదాన్ని. ఈ ఫొటో దిగిన కొన్నిరోజులకే మరీ చిన్న వయసులోనే ఇలా కనబడకూడదనే ఆలోచనతో జిమ్‌లో జాయిన్‌ అయ్యాను. ముందు ట్రెడ్‌మిల్‌ మీద 5 నిమిషాలు, ఆ తర్వాత 15 నిమిషాలు, ఆ తర్వాత బ్రేక్‌ లేకుండా 40 నిమిషాలు పరిగెత్తగలిగాను.

రైట్‌లో ఉన్న ఫొటో 2019 డార్జిలింగ్‌లో దిగాను. ఐదేళ్ల తర్వాత 18 కిలోలు తగ్గా. పొట్ట ఇంకాస్త ఫ్లాట్‌గా ఉంటే బావుండూ, ఆ డ్రెస్‌లో అమ్మాయి ఇంకా బావుంది అనిపిస్తూనే ఉంటుంది. మరోవైపు సోషల్‌ మీడియా ఎప్పటికప్పుడు అభద్రతాభావానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కోసం తగ్గండి. ఇంకొంచెం ఎక్కువకాలం మీ గుండె పని చేయడానికి, చివరి వరకూ మీ మోకాళ్లు మిమ్మల్ని మోసేవరకూ, అనారోగ్యం లేని శరీరం కోసం, హాయిగా నిద్రించగలిగే రాత్రుల కోసం.. ముఖ్యంగా మీకోసం చేయండి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement