opens
-
Bhumika Chawla: వ్యాపారంలోకి అడుగుపెట్టిన భూమిక.. అదేంటో తెలుసా? (ఫొటోలు)
-
యాక్సిస్ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘యాక్సిస్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. నూతన పథకం ద్వారారూ.2,500 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. దేశ తయారీ రంగంలోని అవకాశాలపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుందని తెలిపింది. నిఫ్టీ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌ను ఈ పథకం ట్రాక్ చేస్తుంది. శ్రేయాష్ దేవాల్కర్, నితిన్ అరోరా ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో చేసిన పెట్టుబడిని 12 నెలల్లోపు ఉపసంహరించుకుంటే 10 శాతంపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ విధించరు. మిగిలిన మొత్తంపై 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోప్‌కుమార్ తెలిపారు. -
Himaja Reddy: అల్వాల్‌లో షాప్ ఓపెనింగ్ చేసిన హిమజ (ఫోటోలు)
-
రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!
భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ లక్షల దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని పలు ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. కొన్ని దేవాలయాలు దూరప్రాంతాలలో నెలకొనివుంటాయి. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బన్షీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్‌లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్‌ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
నల్గొండలో అలజడి రేపిన కృతీ శెట్టి (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో రేపటినుండి తెరుచుకోనున్న థియేటర్స్
-
లాకులెత్తారు!
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్డౌన్’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు. అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి. షాపింగ్ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్ షీల్డ్‌లు ధరించి సర్వీస్ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్ మెన్యూస్, డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. -
కేవలం మీకోసం చేయండి
‘‘నాలుగేళ్ల క్రితం నేను ఉండాల్సిన దానికంటే కొంచెం బరువు ఎక్కువే ఉన్నాను. అలా ఉండటానికి నేనేం ఇబ్బంది పడలేదు. మునుపటి కంటే లుక్స్ పరంగా బావుండాలనే ఉద్దేశంతో వర్కౌట్ మొదలుపెట్టాను. ‘గుడ్ లుక్స్’కి అంతం అనేది ఉండదు’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. ఈ ఏడాది ‘జెర్సీ’ సినిమాలో తన నటనకు మంచి ప్రసంశలు పొందారు ఈ కన్నడ బ్యూటీ. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుత ఫొటోను, నాలుగేళ్ల క్రితం ఫొటోను పోస్ట్ చేసి శారీరకంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. ‘ ‘లాయర్‌గా ఉద్యోగం వచ్చి, 2014లో నా తొలి ఇంటర్నేషనల్ హాలిడేకు (బాలి) Ðð ళ్లినప్పుడు దిగిన ఫొటో అది. ఉద్యోగంతో నా లైఫ్ స్టయిల్ మారిపోయింది. నాకు నచ్చినంత తినేదాన్ని. నన్ను నేను బాగా కష్టపడి మోటివేట్ చేసుకొని నెలకోసారి జిమ్‌కి వెళ్లేదాన్ని. చేతులు బొద్దుగా ఉన్నాయి అని సంకోచించకుండా నాకు నచ్చిన దుస్తులు వేసుకునేదాన్ని. ఈ ఫొటో దిగిన కొన్నిరోజులకే మరీ చిన్న వయసులోనే ఇలా కనబడకూడదనే ఆలోచనతో జిమ్‌లో జాయిన్ అయ్యాను. ముందు ట్రెడ్మిల్ మీద 5 నిమిషాలు, ఆ తర్వాత 15 నిమిషాలు, ఆ తర్వాత బ్రేక్ లేకుండా 40 నిమిషాలు పరిగెత్తగలిగాను. రైట్లో ఉన్న ఫొటో 2019 డార్జిలింగ్‌లో దిగాను. ఐదేళ్ల తర్వాత 18 కిలోలు తగ్గా. పొట్ట ఇంకాస్త ఫ్లాట్‌గా ఉంటే బావుండూ, ఆ డ్రెస్‌లో అమ్మాయి ఇంకా బావుంది అనిపిస్తూనే ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అభద్రతాభావానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కోసం తగ్గండి. ఇంకొంచెం ఎక్కువకాలం మీ గుండె పని చేయడానికి, చివరి వరకూ మీ మోకాళ్లు మిమ్మల్ని మోసేవరకూ, అనారోగ్యం లేని శరీరం కోసం, హాయిగా నిద్రించగలిగే రాత్రుల కోసం.. ముఖ్యంగా మీకోసం చేయండి’’ అన్నారు. -
రూపాయి పతనం, పుత్తడి ధరలు ఢమాల్
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో మొదలుకాగా, దేశీయ కరెన్సీ, పసిడి బలహీనంగా మొదలైంది. దాదాపు15 పైసలు నష్టపోయి రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ మారకరంలో రుపీ రూ. 64.68 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ ఆర్థిక డేటా అంచనాలను మించిన మోదు కావడంతో డాలర్ కు డిమాండ్ పుట్టింది. పై విదేశీ యూనిట్‌ను బలపరిచింది. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో విదేశీ కరెన్సీల నుంచి డాలర్‌కు లాభాల బాటలో నడిచింది. డాలర్ రెండువారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. అటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంపునకే సంకేతాలివ్వడంతో దేశీయ కరెన్సీపై ఒత్తడి ప్రకటించింది. దీంతో గురువారం రూపాయి విలువ 23 పైసలు పడిపోయింది, రెండు వారాల కనిష్టం 64.53 డాలర్ల వద్ద ముగిసింది. అటు బంగారం , వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. శుక్రవారం కూడా పతనం దిశగానే పయనిస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి ధర పది గ్రా. 268 నష్టపోయి రూ. 28,762 వద్ద ముగియగా ఈ రోజు స్వల్పంగా పుంజుకుని రూ.28,784వద్ద ఉంది.. డాలర్ బలం, ఆయిల్ధరల క్షీణత ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 28,836వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8905వద్ద ట్రేడ్అవుతున్నాయి. దీంతో నిఫ్టీ 8900వేలకు పైన, సెన్సెక్స్ 29వేలకు దిగువన కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నట్టు ఎనలిస్టుల అంచనా. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగం నష్టాల్లో, 0.08శాతం నష్టంతో బ్యాంక్ నిఫ్టీకూడా బలహీనంగానే ఉంది. సుగర్ , ఏవియేషన్, మీడియా స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. వైజాగ్ ప్లాంట్‌లో తనిఖీలతో డా. రెడ్డీస్ భారీగా నష్టపోతుండగా, గెయిల్, ఒఎన్జీసీ,ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఐడియా సెల్యులార్ నష్టంలోనూ, ఎస్బీఐ, సన్‌పార్మా, భారతి ఫైనాన్షియల్, ఇందస్ ఇండ్ , గ్రాసిం, హావెల్స్, జస్ట్ డయల్, డిష్‌టీవీ, ఏషియన్ పెయింట్స్, ఏసీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఎంఅండ్ఎం లాభాల్లోఉన్నాయి. రిలయన్స్ లో బ్లాక్ డీల్ కారణంగా ఆర్ఐఎల్ బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అటు డాలర్ మారకంలో దేశీ కరెన్సీ 0.15పైసల నష్టంతో రూ.66.82 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.112 క్షీణించి రూ.28,639వద్ద ఉంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 18పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ప్రారంభ మయ్యాయి. అనంతరం కొద్దిగా తేరుకుని ప్రస్తుతం సెన్సెక్స్ 22 పాయింట్లు బలపడి 28,357వద్ద నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,775 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూకోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకటనపై బ్యాంకింగ్ నిఫ్టీ మూవ్ ఆధారపడనుంది. అలాగే ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ పాజిటివ్‌గా గాను, ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ నెగిటివ్‌గా స్పందిస్తోంది. అటు సన్ టీవీ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యాక్టివ్ గా ఉంది. టైటన్, సీబీజెడ్ లాంటి బంగారం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. -
నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో 26397 వద్ద, నిఫ్టీ 56 నష్టంతో 8136వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టీ కీలక మద్దతుస్తాయి 8150 కిందికి దిగజారింది. బ్యాంక్ నిప్టీ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ ఎఫ్ ఎంసీజీ, ఆటో రంగం నష్టపోతోంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాల్లోఉన్నాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు దాదాపు రూ. 403 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ మాత్రం యథావిధిగా రూ. 238 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రెండు పైసల లాభంతో రూ. 68.37 వద్ద వద్ద ఉంది. -
రెండురోజుల్లో 10వేలకు పైగా ఖాతాలు
ముంబై: టెలికాం రంగంలో రారాజులా వెలుగొందుతున్న భారతి ఎయిర్ టెల్ మరో ఘనతను సాధించింది. మొట్టమొదటి పే మెంట్ బ్యాంకును ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఎయిర్ టెల్ పే మెంట్ బ్యాంకు రికార్డు స్థాయి ఖాతాలతో దూసుకుపోతోంది. పైలట్ ప్రాజెక్ట్ తో రాజస్థాన్ లో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ తో కేవలం రెండు రోజుల్లోనే ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ 10,000 పైగా పొదుపు ఖాతాలను నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు గణనీయమైన వృద్ధి ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అకౌంట్లు తెరిచినట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీతో ఇటీవల ప్రయోగాత్మంగా ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ ను ప్రారంభించింది. దేశంలో పొదుపు ఖాతాలపై అధిక వడ్డీని చెల్లించడంతో పాటు లక్ష రూపాయల వ్యక్తిగత బీమాను కూడా అందిస్తున్నామని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. రాబోయే రోజుల్లో ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు. మరోవైపు ఆర్బీఐ ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో వ్యక్తిగత ఖాతాదారుల గరిష్ట పరిమితిని లక్ష రూపాయలుగా నిర్ణయించింది. -
రింగింగ్ బెల్స్ మరో సంచలనం షురూ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రింగింగ్ బెల్స్ ఫ్రీడం టీవీలంటూ వినియోగదారుల ముందుకొస్తోంది. 10 వేల లోపే చీసెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీ అంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేసింది. తమ కొత్త 'ప్రీడమ్ 9900' టీవీలకోసం ఆగస్టు 15 న బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటన చేసింది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీల ను రూ. 9,900లకే అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 15 న బుకింగ్ మొదలవుతుందనీ, తరువాతి రోజు నుంచి (ఆగస్టు 16 ) పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. క్యాష్ ఆన్ పద్ధతిలో వీటిని డెలివరీ చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1366x768 పిక్సెల్స్, రిజల్యూషన్, 3000 కాంట్రాస్ట్ రేషియో, రెండు హెచ్ డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు, రెండు స్పీకర్ల తదితర ఫీచర్లు దీని సొంతం. అసక్తివున్నవారు సంస్థ వెబ్ సైట్ రింగింగ్‌బెల్స్ .కో.ఇన్ వెబసైట్ లో బుకింగ్ లు చేసుకోవచ్చు. తమ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే తమ టెలివిజన్ కు కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తామనే భరోసా వినియోగదారులకు ఉందని పేర్కొంది. -
ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్!
స్వీడన్ః మట్టిరోడ్లు, కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇలా ఎన్నో రకాల రోడ్లను చూశాం. కానీ ఎలక్ట్రిక్ రోడ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? కరెంటుతో వాహనాలు నడిచేందుకు వీలుగా నిర్మించే ఈ రోడ్లు.. ఇప్పుడు ప్రయాణీకులకు, వాహనదారులకు ఎంతో సౌలభ్యాన్ని అందించడమే కాక, డీజిల్, పెట్రోల్ అవసరాన్ని కూడ తగ్గించే అవకాశం ఉంది. ఈ కొత్త రకం రోడ్లతో గాల్లో కాలుష్యం శాతం కూడ తగ్గి, మంచి వాతావరణం అందుబాటులోకి వస్తుందంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. ఎలక్ట్రిక్ రోడ్లకు స్వీడన్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారి శాడ్వికెన్ లో ఈ ఆధునిక సాంకేతిక రోడ్ల పై ప్రయోగాలు నిర్వహించింది. ప్రపంచంలోనే రోడ్ ట్రాన్స్ పోర్ట్ కోసం అత్యధికంగా కరెంటును వినియోగిస్తున్న ఏకైక దేశమైన స్వీడన్.. ఇప్పుడు ఏకంగా వాహనాలు నడిచే రోడ్లనే విద్యుత్ శక్తి సహాయంతో నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ కొత్త తరహా రోడ్లతో వాహనాలకు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గడంతోపాటు, కార్బండయాక్పైడ్ ను నిరోధించే అవకాశం ఉంది. ఈ సరికొత్త విధానం మంచి వాతావరణానికి సహకరించే మార్గంగా చెప్పొచ్చని, దీనికితోడు రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ట్రాఫిక్ వెర్కెట్, డైరెక్టర్ జనరల్, లీనా ఎరిక్సన్ తెలిపారు. స్వీడన్ శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టిన కరెంటు రోడ్లపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకున్నట్లుగా ఈ తరహా రోడ్లు అందుబాటులోకి వస్తే.. వీటిపై భారీ వాహనాలు సైతం రయ్యిన దూసుకుపోవచ్చని చెప్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ జరుపుతున్న నిర్వాహకులు.. ప్రయోగాలు పూర్తి చేసుకొన్న అనంతరం 2030 నాటికి అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలపై నడిచే ఎలక్ట్రిక్ ట్రైన్లకు పైన కరెంటు తీగలతో ఎలా విద్యుత్తును అందిస్తారో అలాగే ఈ రోడ్లపై నడిచే వాహనాలకు విద్యుత్ కేబుళ్ళద్వారా ఎలక్ట్రిసిటీని అందిస్తారు. రోడ్ల కింద ఏర్పాటు చేసే విద్యుత్ ఆధారంగా వాహనాలు నడిచేందుకు జరుగుతున్న ప్రయోగాలు పూర్తయితే ఇక గతుకుల రోడ్లపై ప్రయాస పడే ప్రయాణీకులు, వాహనదారులకు పండగే. -
రిలయన్స్ జియో 4G సేవలు ప్రారంభం...కానీ..
దేశంలో సెల్ వినియోగంలో విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎట్ట కేలకు తన జీయో సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించింది. సాధారణ ప్రజలకు 4జీ సేవలను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడో మెలిక ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఆహ్వానం ఉంటేనే జియో సిమ్ కొనుక్కోవడానికి వీలవుతుంది. లేదంటే రిలయన్స్ డిజిటల్లో లైఫ్ మొబైళ్లను కొనుగోలు చేసినా, ఈ జియో 4జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే ఈ మొబైల్స్ మొబైళ్లు రూ.5,599- 19,499 ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్యపరమైన ప్రారంభానికి దగ్గరపడుతున్న నేపథ్యంలో..మా నెట్‌వర్క్‌ను పరీక్షించేందుకు వీలుగా ఆప్తులకు, సన్నిహితులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నామని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా రిలయన్స్ జియో 4జీ సిమ్ లేదా లైఫ్ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థ ఉద్యోగి గరిష్ఠంగా 10 మందిని ఆహ్వానించవచ్చు. కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు 90 రోజుల పాటు అపరిమిత 4జీ మొబైల్ ఇంటర్నెట్, ఫోన్ కాల్స్‌ను కంపెనీ అందిస్తుంది. అన్నట్టు ఈ సేవలను యాక్టివేట్ చేసుకునేందుకు ఆహ్వానం పొందిన వ్యక్తి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు జియోకు చెందిన 4జీ యాప్‌లు జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియోమ్యాగ్, జియో బీట్స్, జియో డ్రైవ్ వంటి వాటిని 90 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అటు ప్రయోగాత్మక దశ(ట్రయల్ ఫేజ్) లో తమ నెట్‌వర్క్‌ను 5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నారని ఆర్ ఐఎల్ ఇటీవల ప్రకటించింది. మొదటి నెలలో 18జీబీకిపైన, అలాగే 250 నిమిషాలకు పైగా వాయిస్ సర్వీసులను వాడుకుంటున్నట్టు తెలిపింది. ఇకో ఫ్రెండ్లీ దిశగా తమ ప్రయోగాలు సాగుతున్నాయని పేర్కొంది. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ.200లు ఖరీదు చేసే సిమ్ ద్వారా 75జీబీ 4జీ డేటాతో పాటుగా 4500 నిముషాల ఫ్రీ కాల్స్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కేబుల్ మోటర్స్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే
-
లాభాల దిశగా స్టాక్ మార్కెట్లు
ముంబై: బుధవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ట్రెండ్ పాజిటివ్ గా ఉండడంతో దాదాపు వంద పాయింట్ల లాభానికి చేరువలో ఉంది. సెన్పెక్స్ 2 పాయింట్ల లాభంతో 27,398 దగ్గర. నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 8,282 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతుస్థాయిలకు పైన నిలబడి స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఐటి ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ , బ్యాంకింగ్ షేర్లు లాభాల బాట పట్టాయి. , ఇన్సోఫిస్, టీసీఎస్ పాజిటివ్ గా ట్రేడవుతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో పోలీస్తే రూపాయి 7 పైసల నష్టంతో 65.12 దగ్గర ఉంది. -
హైదరాబాద్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్