ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 28,836వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8905వద్ద ట్రేడ్‌అవుతున్నాయి. దీంతో నిఫ్టీ 8900వేలకు పైన, సెన్సెక్స్ 29వేలకు దిగువన కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నట్టు ఎనలిస్టుల అంచనా.
ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగం నష్టాల్లో, 0.08శాతం నష్టంతో బ్యాంక్ నిఫ్టీకూడా బలహీనంగానే ఉంది. సుగర్ , ఏవియేషన్, మీడియా స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. వైజాగ్ ప్లాంట్‌లో తనిఖీలతో డా. రెడ్డీస్ భారీగా నష్టపోతుండగా, గెయిల్, ఒఎన్‌జీసీ,ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, ఐడియా సెల్యులార్ నష్టంలోనూ, ఎస్‌బీఐ, సన్‌పార్మా, భారతి ఫైనాన్షియల్, ఇందస్ ఇండ్ , గ్రాసిం, హావెల్స్, జస్ట్ డయల్, డిష్‌టీవీ, ఏషియన్ పెయింట్స్, ఏసీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఎంఅండ్‌ఎం లాభాల్లోఉన్నాయి. రిలయన్స్ లో బ్లాక్ డీల్ కారణంగా ఆర్‌ఐఎల్ బలహీనంగా ట్రేడ్ అవుతోంది.
అటు డాలర్ మారకంలో దేశీ కరెన్సీ 0.15పైసల నష్టంతో రూ.66.82 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.112 క్షీణించి రూ.28,639వద్ద ఉంది.